Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పోషకాహారాన్ని అందిస్తున్న ఆసుపత్రిగా అపోలో హెల్త్‌ సిటీ

విశాలాంధ్ర/హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని జొన్నలు, ఇతర తృణధాన్యాలకు సంబంధించిన ప్రముఖ పరిశోధనా సంస్థ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్‌ (ఐసిఎఆర్‌ – ఐఐఎమ్‌ఆర్‌), హాస్పిటల్స్‌లో రోగులు తృణధాన్యాల వినియోగాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఐసిఎఆర్‌ – ఐఐఎమ్‌ఆర్‌ న్యూట్రిహబ్‌ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్స్‌ సంవత్సరంగా ప్రకటించినందున ఇది అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. న్యూట్రిహబ్‌, ఐసిఎఆర్‌ – ఐఐఎమ్‌ఆర్‌, డాక్టర్‌ బి.దయాకర్‌రావు, అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, డాక్టర్‌ సంగీతారెడ్డిని ఈ సందర్బంగా సత్కరించారు. అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ – జూబ్లీహిల్స్‌ లోని అపోలో హెల్త్‌ సిటీ రోగులకు ఇప్పుడు సూపర్‌ ఫుడ్‌ మిల్లెట్‌ను చురుగ్గా అందిస్తున్న భారతదేశంలోని మొట్టమొదటి హాస్పిటల్‌గా గుర్తింపు అందుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img