Friday, April 26, 2024
Friday, April 26, 2024

రాష్ట్రంలో విద్యార్థులకు వివో స్కాలర్‌షిప్‌లు

హైదరాబాద్‌ : ప్రముఖ గ్లోబల్‌ స్మార్ట్‌ఫోన్‌న్‌ తయారీదారు వివో తెలంగాణలోని వెనుకబడిన వర్గాల నుండి అర్హులైన విద్యార్థుల ఉన్నత విద్యకు తోడ్పడటానికి ‘వివో ఫర్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్షిప్‌’ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమం సామాజిక, ఆర్థిక విభజనను తగ్గించడం, తక్కువ-ఆదాయ కుటుంబాల నుండి విద్యార్ధులు విద్యను కొనసాగించడానికి సహాయపడటాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. 10, 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు తమ పాఠశాల ఫీజులు మరియు ఇతర సంబంధిత విద్యాసంస్థలను కవర్‌ చేయడానికి రూ. 10,000 స్థిర వన్‌-టైమ్‌ ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. భారతదేశంలో అతిపెద్ద విద్యార్థి స్కాలర్‌షిప్‌ ప్లాట్ఫామ్‌ అయిన ‘బడ్డీ 4 స్టడీ’ భాగస్వామ్యంతో స్కాలర్షిప్లు విద్యార్థులకు పంపిణీ అవుతాయి. వివో తన కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీలో భాగంగా స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img