Friday, April 26, 2024
Friday, April 26, 2024

వాట్సప్‌లో యుపిఐ చెల్లింపు విధానం సులువు

ముంబయి: స్థానిక కిరాణా స్టోర్‌ నుంచి నిత్యావసరాలను కొనుగోలు చేసినా లేదా స్నేహితులు, కుటుంబ సభ్యులకు నగదు పంపించేందుకు లేదా స్వీకరించేందుకు యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) డిజిటల్‌గా చెల్లించేందుకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఒకే ప్లాట్‌ఫారమ్‌పై మెసేజింగ్‌, చెల్లింపుల శక్తిని మిళితం చేసే ఎంపిక మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. వాట్సప్‌ సరిగ్గా దీన్నే చేస్తుంది. ఇది తన ప్లాట్‌ఫారమ్‌లో రెండు ప్రపంచాల్లోని ఉత్తమమైన వాటిని అందిస్తుంది. వాట్సాప్‌లో, నగదు బదిలీ చేయడం అనేది సందేశాన్ని పంపినంత సులభం. వినియోగదారులు తమ చాట్‌లలో ఒక అనుకూలమైన చోట యూపీఐ ఆధారిత చెల్లింపులను సజావుగా చేసేందుకు అనుమతిస్తుంది. యూపీఐ చెల్లింపును ప్రారంభించేందుకు మీరు కాంటాక్ట్‌తో చాట్‌ చేస్తున్నప్పుడు ‘?’ చిహ్నాన్ని నొక్కండి లేదా భారతదేశంలోని 20 మిలియన్ల కన్నా ఎక్కువ క్యూఆర్‌ కోడ్‌ అందుబాటులో ఉన్న స్టోర్లలో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి చెల్లించండి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img