Friday, April 26, 2024
Friday, April 26, 2024

నీట్‌ అభ్యర్థులకు ఓయో హోటళ్ళలో 60% డిస్కౌంటు

న్యూఢల్లీి: ప్రపంచ ఆతిథ్య టెక్నాలజీ కంపెనీ ఓయో జాతీయ అర్హతా ప్రవేశ పరీక్ష (నీట్‌) 2022 కొరకు హాజరు కాబోయే మహిళా అభ్యర్థినుల కోసం ఒక ప్రత్యేక డిస్కౌంట్‌ స్కీమును ప్రకటించింది. ఈ స్కీము క్రింద, తమ నీట్‌ పరీక్షా కేంద్రాలకు ప్రయాణించే మహిళా అభ్యర్థినులు అందరూ దేశవ్యాప్తంగా ఓయో హోటళ్ళలో బస చేయడానికై 60% వరకూ డిస్కౌంటు పొందవచ్చు. డిస్కౌంట్‌ స్కీము రెండు రోజులు అనగా 2022, జూలై 16 మరియు జూలై 17 తేదీలలో చెల్లుబాటులో ఉంటుంది. ఈ పరీక్ష 2022 జూలై 17 వ తేదీ ఆదివారం ఇండియా వ్యాప్తంగా 497 నగరాలలోని వివిధ కేంద్రాలలో జరగడానికి షెడ్యూలు చేయబడిరది. ఆశావహులైన మహిళా అభ్యర్థినులకు ముఖ్యమైన పరీక్షా కేంద్రాల వద్ద వసతి సౌకర్యపు ఆవశ్యకతలతో ఓయో మద్దతు ఇస్తుంది. ఈ డిస్కౌంటును పొందడానికి గాను, ఓయో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img