Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఆస్కార్స్‌లో సందడి చేయనున్న దీపిక


ముంబై: బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్స్‌లో దీపికా పదుకొణె ఒకరు. భారతదేశ ఖ్యాతిని ఆమె ప్రపంచానికి చాటి చెబుతున్నారు. కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో గతేడాది జ్యూరీ మెంబర్‌గా వ్యవహరించారు. తాజాగా మరో గౌరవాన్ని దక్కించుకున్నారు. 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఆస్కార్స్‌ను ప్రదానం చేయనున్నారు. ఎమిలీ బ్లంట్‌, శామ్యూల్‌ జాక్సన్‌, డ్వేన్‌ జాన్సన్‌, మైఖేల్‌ జోర్డాన్‌, జో సల్దానా, రిజ్‌ అహ్మద్‌ తదితరులు కూడా పురస్కారాలను అందజయనున్నారు. ఆస్కార్‌ అవార్డ్స్‌ను లాస్‌ ఏంజెలెస్‌లో మార్చి 12న (భారతదేశ కాలమనం ప్రకారం మార్చి 13) ప్రదానం చేస్తారు. అయితే, అకాడమీ అవార్డ్‌ను అందజేయ బోతున్న మొదటి భారతీయురాలు దీపికా పదుకొణె ఏం కాదు. గతంలో పెర్సిస్‌ ఖంబటా, ప్రియాం క చోప్రా వంటి భారతీయులు అకాడమీ అవార్డ్‌ను అందజేశారు. దీపికా పదుకొణె తాజాగా ‘పఠాన్‌’లో నటించారు. ఈ చిత్రంలో షారూఖ్‌ ఖాన్‌, జాన్‌ అబ్రహాం కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్‌ వైడ్‌గా రూ.1000కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. దీపిక, హృతిక్‌ రోషన్‌తో ‘ఫైటర్‌’ చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. భారీ బడ్జెట్‌ సినిమా ‘ప్రాజెక్ట్‌ కె’లో హీరోయిన్‌ పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img