Friday, April 26, 2024
Friday, April 26, 2024

కండల హీరో హృతిక్ సరసన నభానటేష్ కి OTT ఆఫర్

వరుసగా టాలీవుడ్ టాప్ హీరోయిన్లు ఓటీటీల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కాజల్ – సమంత-తమన్నా- అమలాపాల్- కియరా అద్వాణీ- రాధికా ఆప్టే లాంటి టాప్ బ్యూటీస్ ఓటీటీ సిరీస్ లతో హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఇక తాజా సమాచారం మేరకు కుర్ర బ్యూటీ నభా నటేష్ ఓటీటీలో తొలి అవకాశం అందుకుందని సమాచారం. సదరు యువ బెంగుళూరు బ్యూటీ బాలీవుడ్ కండల హీరో హృతిక్ రోషన్ సరసన ఆఫర్ దక్కించుకుందని కథనాలొస్తున్నాయి. నభ వెబ్ సిరీస్ లో హృతిక్ తో స్క్రీన్ స్పేస్ ని పంచుకుంటుందని.. ఇది హృతిక్ – నభా జంటకు ఓటీటీ అరంగేట్రం అవుతుందని ప్రచారం సాగుతోంది. `ది నైట్ మేనేజర్`కు అధికారిక రీమేక్ ఇది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ క్రేజీ సిరీస్ లో భాగమైన నభా గురించి అధికారికంగా కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు నభా ఆడిషన్ క్లిప్ లు చాలా కాలంగా చాలా ఉన్నత స్థాయి బాలీవుడ్ ప్రొడక్షన్స్ లో షికార్ చేస్తున్నాయట. చూస్తుంటే నభా మునుముందు బాలీవుడ్ లో సత్తా చాటాలని భావిస్తున్నట్టు అర్థమవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img