Friday, April 26, 2024
Friday, April 26, 2024

దసరాకు ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’


హైదరాబాద్‌ : అఖిల్‌ అక్కినేని నటించిన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌`2 బ్యానర్‌ పై బన్నీ వాసు నిర్మించారు. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలనుకున్న మేకర్స్‌ పోస్ట్‌పోన్‌ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకి విజయదశమి పండుగ సందర్భంగా అక్టోబర్‌ 8న రిలీజ్‌ చేస్తున్నట్టు ఓ కొత్త పోస్టర్‌ విడుదల చేసి అధికారకంగా ప్రకటించారు. అఖిల్‌ గత మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. మరి ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ మూవీతోనైనా సూపర్‌ హిట్‌ అందుకుంటాడా లేదా చూడాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img