Friday, April 26, 2024
Friday, April 26, 2024

పాయల్ దెబ్బకు జగిత్యాల్ జంక్షన్ జామ్

ఆర్ ఎక్స్ -100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆవిడ అడుగుపెట్టిన చోటల్లా జంక్షన్ జామ్ అయిపోతోందనడానికి తాజాగా రిలీజైన ఈ ఫోటోలే సాక్ష్యం. పాయల్ అలా చిన్న నగరాలకు రిబ్బను కటింగులకు వెళ్లిందంటే చాలు జనం గుంపులుగా మీద పడుతున్నారు. ఇప్పటికే ఈ బ్యూటీ టాలీవుడ్ ఆడియన్స్ ని హాట్ ఫోజులతో ఊపేస్తోన్న సంగతి తెలిసిందే. తొలి సినిమా ఆర్.ఎక్స్ 100 సక్సెస్ తో ఈ పంజాబీ బ్యూటీకి తెలుగులో ఆఫర్లు వెంటపడ్డాయి. ఏక ధాటిగా ఓ ఐదారు సినిమాలు ఏడాపెడా చేసేసింది. అయితే అవేవి సక్సెస్ సాధించలేదు. నామ మాత్ర ఫలితాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం తమిళ్ లో ఎంజెల్ అనే సినిమాతో పాటు.. తెలుగులో కిరాతక సినిమాలు చేస్తోంది. మరే కొత్త ప్రాజెక్ట్ చేతిలో లేదు. అయితే ఈ భామ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలన్న నానుడిని తొలి నుంచి బాగానే ఆచరిస్తోంది. కెరీర్ ఆరంభం నుంచి పాయల్ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లో చురుకుగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే.పెద్ద సంస్థలకు ఇంకా బ్రాండ్ అంబాసిడర్ కాకపోయినా మాల్స్ ఓపెనింగ్స్ లో క్రేజీ భామగానే వెలగిపోతుంది. పాయల్ ఓపెనింగ్స్ కి మంచి గిరాకీ ఉండటంతో చిరు వ్యాపారులు అమ్మడినే కోరుకుంటున్నారు. కుర్రకారులో క్రేజీ భామగా వెలిగిపోతుంది కాబట్టే ఆ ఛాన్సులంటూ గతంలో కామెంట్లు హీటెక్కించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జగిత్యాల టౌన్ ని బ్లాక్ చేసింది. పట్టణంలో మోచీబజార్ లో ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లింది. పాయల్ రాకతో భారీగా జనం తరలి వచ్చారు. ఆర్.ఎక్స్ బాంబ్ సిటీలో ఎంట్రీ గురించి విషయం ముందే బయటకు రావడంతో కుర్రకారంతా ఒకే చోట పోగయ్యారు. దగ్గర నుంచి చూసేందుకు మీద పడ్డారు. దీంతో మోచీబజార్ లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కాగా ఎంట్రీ కోసం పాయల్ అందమైన పదహారణాల తెలుగమ్మాయిలా చక్కటి చిలకాకుపచ్చ చీర-జాకెట్ లో తళుక్కున మెరిసింది. నుదిటిన పాపిడిబొట్టు తో పల్లెటూరి అమ్మాయిని తలపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img