Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రతిభ లేకపోతే ప్రయాణం కష్టం!

‘మా నాన్నగారి వల్లే పరిశ్రమలోకి వచ్చాను. నాన్న సపోర్ట్‌ ఉన్నా ఈ పోటీ ప్రపంచంలో ఎదగాలి అంటే నా ప్రయాణాన్ని నాకు నేనుగా ముందుకు సాగించాలి. ప్రతిభ లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ప్రయాణం అంత సులభం కాదు’ అని గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ అన్నారు. శుక్రవారం సాయంత్రం అమెరికా నుంచి ఢల్లీి చేరుకున్న ఆయన ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్‌’లో పాల్గొన్నారు. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. సినిమా పరిశ్రమలో బంధుప్రీతి ఎక్కువ అంటూ ఎంతో కాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే? ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ అంశంపై ఎంతోమంది తారలు వివాదాలు సృష్టించారు. కొంతకాలం తర్వాత అది టాలీవుడ్‌కు కూడా చేరింది. ఇదే విషయంపై ఢల్లీి వేదికగా రామ్‌చరణ్‌ మాట్లాడారు. స్టార్‌ హీరోకి కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా ప్రతిభ లేకపోతే ఇక్కడ ముందుకుసాగడం కష్టమని తెలిపారు. ప్రతిభ ఉంటేనే ఇండస్ట్రీ అయినా, ప్రేక్షకులైనా ప్రోత్సహిస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నెపోటిజం ఈ మాట విన్న ప్రతిసారీ నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో దీని గురించి చాలా పెద్ద చర్చ జరిగింది. బంధుప్రీతి ఉందని ఊహల్లో ఉండేవారి వల్లే ఇంత చర్చ జరుగుతోంది. చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్‌ అంటే ఇష్టం. సినిమానే ఊపిరిగా తీసుకుంటూ ఎంతోమంది నిర్మాతలను కలుసూ సినిమాలు చేస్తున్నా. నా మనసుకు నచ్చిన పని చేయడం, అది ప్రేక్షకులకు, అభిమా నులకు నచ్చడం వల్లే 14 ఏళ్లుగా ఇక్కడ సక్సెస్‌ ఫుల్‌గా నిలబడగలిగాను’ అని అన్నారు. భవిష్య త్తులో మీరు చేయాలనుకుంటున్న జానర్‌ ఏంటి అని ప్రశ్నించగా ‘స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో సినిమా చేయాలనుందని, విరాట్‌ కోహ్లీ బయోపిక్‌ తీస్తే అందులో నటించడానికి సిద్ధంగా ఉన్నా నని చరణ్‌ చెప్పారు. ఇదే వేదికపై రామ్‌చరణ్‌ తన స్టాఫ్‌ మొత్తాన్ని పరిచయం చేశారు. 15 ఏళ్లకు పైబడి వారంతా ఆయనతోనే పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img