Friday, April 26, 2024
Friday, April 26, 2024

‘ఫలానా అబ్బాయి…ఫలానా అమ్మాయి’ నుంచి మరో పాట

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో కొందరి కలయికలో సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రెటీలు సైతం ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. అలాంటి కోవలోదే శ్రీనివాస్‌ అవసరాల-నాగశౌర్య కాంబినేషన్‌. గతంలో వీళ్ల కలయికలో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’, ‘జో అచ్యుతానందా’ సినిమాలు సినీ ప్రేక్షకులను అలరించాయి. ఈ రెండు సినిమాలు కమర్షియల్‌గా భారీ విజయాలు సాధించకపోయినా… ఇప్పటికీ టీవీల్లో వస్తున్నాయంటే కన్నార్ప కుండా చూస్తుంటాం… కాగా ఏడేళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరి కలయి కలో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే న్యూఏజ్‌ లవ్‌స్టోరీ తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా మేకర్స్‌ ఈ సినిమాలోని టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్‌ శ్రోతలను తెగ ఆకట్టుకుం టోంది. స్మూతి స్వరాలు సమకూర్చగా, కళ్యాణ్‌ మాలిక్‌ ఆలపించారు. భాస్కరబట్ల సాహిత్యం కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పటికే రిలీజైన కన్నులచాటు మేఘమా పాటకు విశేష స్పందన వచ్చింది. రోమ్‌ కామ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా మాళవికా నాయర్‌ నటిసున్నారు. మార్చి 17న ఈ సినిమా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img