Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

‘రౌడీబాయ్స్‌’ టీజర్‌ వచ్చేసింది

హైదరాబాద్‌ : ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు సోదరుడు శిరీష్‌ తనయుడు ఆశిష్‌ హీరోగా పరిచయ మవుతున్న చిత్రం ‘’రౌడీ బాయ్స్‌’’. యూత్‌ పుల్‌ కమర్షియల్‌ ఎంటర్టైనర్‌ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆశిష్‌ సరసన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ – మోషన్‌ పోస్టర్‌ – టైటిల్‌ సాంగ్‌ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా టీజర్‌ ని చిత్ర బృందం రిలీజ్‌ చేసింది.‘రౌడీ బాయ్స్‌’ సినిమా కాలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో సాగే లవ్‌ అండ్‌ యాక్షన్‌ డ్రామా అని టీజర్‌ చూస్తే అర్థం అవుతోంది. ‘కాలేజ్‌ అనేది వండర్‌ ఫుల్‌ ప్లేస్‌.. ఇక్కడే మీరు ఎవరు ఏమిటి ఏమవుతారనేది డిసైడ్‌ అవుతుంది.. కాలేజ్‌ మీకు చదువు తో పాటుగా జీవితాన్ని నేర్పిస్తుంది’ అని చెప్పే డైలాగ్‌ తో టీజర్‌ ప్రారంభమైంది. స్టూడెంట్స్‌ మధ్య గ్యాంగ్‌ వార్స్‌.. వేర్వేరు కాలేజీలకు చెందిన ఆశిష్‌ – సాహిదేవ్‌ విక్రమ్‌ ఇద్దరూ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ కోసం గొడవ పడటం వంటివి చూపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img