Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

నేటి నుండి దండు మారెమ్మ అమ్మవారి ఉత్సవాలు

విశాలాంధ్ర – గణపవరం: కొల్లేటి గ్రామాలకు ముఖ ద్వారంగా ఉన్న గణపవరం గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవత దండు మారెమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవాలు ఈనెల 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు వారం రోజులు పాటు జాతర తిరణాలు జరుగుతాయని ఆలయ ఉత్సాహ కమిటీ సోమవారం తెలిపారు. భీమవరం మావుళ్ళమ్మ తర్వాత అంతటి సత్యవంతమైన దేవతగా పేరుపొంది 60 గ్రామాల నుండి భక్తులు ఈ తిరణాలు పాల్గొంటారని తెలిపారు. మంగళవారం సాయంత్రం గవళ్ళ గుడుపు సేవతో జరుగుతుందని ఈ సేవ లో రాజేశ్వరి కాళీక నృత్య ప్రదర్శన, లక్ష్మీ దుర్గ డీకే తీన్మార్, సాయిబాబా మ్యూజికల్ ఫుల్ బ్యాండ్ పార్టీ, కనకమహాలక్ష్మి ఈవెంట్స్ జై భజరంగ్ డీజే మిక్సింగ్, ధానేశ్వరి చందా మేళం, కేరళ డ్రమ్స్, డి ఎం ఎస్ నాసిక్ డోలు వంటి కార్యక్రమాలతో జరుగుతాయని 20 తేదీన రాత్రి 8 గంటలకు కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శన, 21న నాని ఆర్కెస్ట్రా ఈవెంట్స్, 22న బాలనాగమ్మ వెరైటీ బుర్రకథ, 23న సత్య హరిచంద్ర నాటకం, 24న స్వాతి ఆర్కెస్ట్రా మ్యూజికల్ నైట్, 25న సినీ మ్యూజికల్ నైట్, 27న అఖండ అన్న సమారాధన జరుగుతుందని ఉత్సవ కమిటీ తెలియజేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img