Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

అదానీపై చర్చకు నో

వెనకేసుకొస్తున్న మోదీ ప్రభుత్వం
జేపీసీ విచారణకు ప్రతిపక్షాల డిమాండ్‌
సాగని చట్టసభలు … సోమవారానికి వాయిదా

న్యూదిల్లీ : అదానీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ వ్యవహారం శుక్రవారం కూడా పార్లమెంటును కుదిపేసింది. మార్కెట్‌లలో అదానీ గ్రూప్‌ డీలాపడినందున ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎల్‌ఐసీ భారీగా నష్టపోయే ప్రమాదం ఉండటంతో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేదా సీజేఐ నేతృత్వంలోని కమిటీతో దర్యాప్తు జరిపించాలని లోక్‌సభలో, రాజ్యసభలో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అంశాలపై కూడా చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. కార్పొరేట్ల కొమ్ముకాసే ప్రభుత్వం అందుకు స్పందించకపోవడంతో ఉభయసభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. దాంతో సోమవారం వరకు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అదానీ గ్రూప్‌ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు సభలో రెండు రోజులుగా డిమాండ్‌ చేస్తున్నాయి. విపక్ష సభ్యుల నినాదాలతో ఉభయసభలు హోరెత్తాయి. సభా కార్యకలాపాలు సజావుగా సాగనివ్వాలన్న స్పీకర్‌ ఓం బిర్లా సూచనలను ప్రతిపక్ష సభ్యులు పట్టించుకోకుండా నినాదాలు కొనసాగించడంతో లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడిరది. ఆ తర్వాత సమావేశమైనప్పుడు విపక్షాల ఆందోళన`నినాదాలు కొనసాగాయి. నిరసన హోరులోనే పార్లమెంటరీ పత్రాల సమర్పణకు సభాపతిగా ఉన్న రాజేంద్ర అగర్వాల్‌ ఆదేశాలిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను జరగనివ్వాలని విపక్ష సభ్యులను కోరారు. తమ డిమాండ్‌పై ప్రతిపక్ష సభ్యులు నిరసన కొనసాగించడంతో లోక్‌సబనుó సోమవారానికి వాయిదా వేశారు. అదే విధంగా రాజ్యసభలోనూ ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేయడంతో చైర్మన్‌ జగదీప్‌ ధన్కర్‌ అసహనం వ్యక్తంచేస్తూ సభను సోమవారానికి వాయిదా వేశారు.
‘6వ తేదీ ఉదయం 11 గంటలకు సభ తిరిగి సమావేశమవుతుందని ప్రకటించిన ఆయన వెల్‌లోకి వెళ్లి సభ నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తొలుత మధ్యాహ్నం 2 గంటల వరకు సభ వాయిదాపడి 2.30 గంటలకు తిరిగి సమావేశైంది. ప్రైవేటు సభ్యుల బిల్లులను ప్రవేశపెట్టాలని ధన్కర్‌ చెప్పారు. అయితే విపక్షాల నిరసన కొనసాగడంతో సభ కార్యకలాపాలు ముందుకు సాగలేదు. అదానీ గ్రూపు వ్యవహారంలో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు సమర్పించిన 15 వాయిదా తీర్మానాలను సభ మొదలైనప్పుడు ధన్కర్‌ తిరస్కరించారు. ‘267 నిబంధన కింద వివిధ సభ్యుల నుంచి 15 నోటీసులు అందాయి. అన్నింటిని పరిశీలించాను. అవి 267 నిబంధనకు తగ్గట్లుగా లేనందున తిరస్కరిస్తున్నా’ అని చెప్పారు.
దీంతో ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి ధన్కర్‌ స్పందిస్తూ ‘మీరు మీ పనిచేశారు.. నేను చేయాల్సినది నేను చేశా’నని బదులిచ్చారు. కాగా నోటీసులు అందజేసిన ఎంపీల్లో మల్లికార్జున ఖడ్గే, సీపీఐ సభ్యులు పి.సంతోశ్‌ కుమార్‌, ఎలామరం కరీం, సయ్యద్‌ నజీర్‌ హుస్సేన్‌, ప్రమోద్‌ తివారీ, కుమార్‌ కేట్కర్‌, అమీ యాజ్నిక్‌, నీరజ్‌ దంగీ, జాన్‌ బ్రిట్టాస్‌, ఏఏ రహీం, వి.శివదాసన్‌, తిరుచీ
శివ, కె.కేశవరావ్‌, సంజయ్‌ సింగ్‌, ప్రియాంక చతుర్వేది ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img