Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

అవన్నీ మోదీ ఇద్దరు మిత్రుల కోసమే : ప్రియాంక గాంధీ

దేశంలో ప్రస్తుతం రూపొందుతున్న విధానాలన్నీ మోదీ ఇద్దరు మిత్రుల ప్రయోజనం కోసమేనని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. ఉత్తరాఖండ్‌ శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె శనివారం ఖటిమా సిటీలో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నుంచి ప్రధాన మంత్రి వరకు బీజేపీ నేతలంతా తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని, వారికి ప్రజల గురించి పట్టదని అన్నారు. ు. దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి పెరగడానికి కారణం కాంగ్రెసేనని మోదీ ఆరోపించారన్నారు. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు కేవలం తమ కర్తవ్యాన్ని మాత్రమే నిర్వహించారని చెప్పారు.ఉత్తరాఖండ్‌లో ఉపాధి అవకాశాలు లేనందువల్ల ఎక్కువ మంది ప్రజలు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో హిమాలయాలు, ప్రకృతి, పర్యాటక అవకాశాలు ఉన్నాయని, కానీ ఉపాధి మాత్రం లేదన్నారు. దేశవ్యాప్తంగా విధానాలన్నీ కేవలం ఇద్దరు పారిశ్రామికవేత్తల కోసం రూపొందుతున్నాయన్నారు. ఆ ఇద్దరూ మోదీకి మిత్రులని చెప్పారు. బడ్జెట్‌లో రైతులు, మధ్య తరగతి వర్గాలు, పేదల కోసం ఏమీ లేదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img