Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

అసలైన కరోనా టీకాల గుర్తింపునకు కేంద్రం సూచనలు

నకిలీ టీకాలపై వార్తల నేపథ్యంలో మార్గదర్శకాలు జారీ
అంతర్జాతీయ మార్కెట్‌లో నకిలీ కొవిషీల్డ్‌ టీకాలను అక్రమార్కులు వ్యాప్తి చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వ్యాక్సినేషన్‌లో భాగంగా ప్రస్తుతం ప్రజలకు ఇస్తున్న కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌, స్పుత్నిక్‌ వీ టీకాల్లో ఏవి అసలైనవి? ఏవి నకిలీవి? అన్నది గుర్తించడానికి మార్గదర్శకాలు జారీచేసింది. భారత్‌లో ప్రస్తుతం కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌, స్పుత్నిక్‌-వి టీకాలను ప్రజలకు ఇస్తున్నారు. ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాల్లో నకిలీ టీకాలు వినియోగిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. భారత్‌లోనూ నకిలీ కొవిషీల్డ్‌ టీకాలు ఇస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీకా తయారీదారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది.
అసలైన టీకాలను ఎలా గుర్తించాలంటే..
కోవిషీల్డ్‌

లేబుల్‌ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. టీకా వయల్‌పై ఆకుపచ్చ రంగు (ప్యాంటోన్‌ 355సీ) కవర్‌ ఉంటుంది. దానిపై ఎస్‌ఐఐ లోగో కనిపిస్తుంది. ఎస్‌ఐఐ లోగో నిట్టనిలువుగా కాకుండా కొంత వంపుగా ఉంటుంది. ట్రేడ్‌మార్కుతో సహా కోవిషీల్డ్‌ అనే బ్రాండ్‌ నేమ్‌ స్పష్టంగా కనిపిస్తుంది. జనరిక్‌ పేరు బోల్డ్‌ ఆక్షరాల్లో కాకుండా సాధారణంగా ఉంటుంది. లేబుల్‌పై ‘సీజీఎస్‌ నాట్‌ ఫర్‌ సేల్‌’ అనే ఇంగ్లిష్‌ అక్షరాలు ఎరుపు రంగుతో అడ్డంగా ప్రింట్‌ చేస్తారు. లేబుల్‌పై కొన్ని అక్షరాలను ప్రత్యేకమైన తెల్ల సిరాతో ముద్రిస్తారు. ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. సులభంగా చదవొచ్చు.తేనెతుట్టె గూళ్ల మాదిరిని పోలిన డిజైన్‌ను సీసాపై అక్కడక్కడ వేస్తారు. మామూలుగా ఇది కనిపించదు. లోతుగా పరీక్షిస్తేనే తెలుస్తుంది.
కోవాగ్జిన్‌
లేబుల్‌పై డీఎన్‌ఏ నిర్మాణం లాంటి చిత్రం అతినీలలోహిత కాంతిలోనే కనిపిస్తుంది. లేబుల్‌పై లేత సముద్రపు నీలిరంగులో ‘కోవాగ్జిన్‌’ పేరు పెద్దగా ఉంటుంది. పేరులోని ‘ఎక్స్‌’ అక్షరంలో ఆకుపచ్చ రంగు కూడా మిళితమై ఉంటుంది.కొవాగ్జిన్‌’ పేరుపై హోలోగ్రాఫిక్‌ ఎఫెక్ట్‌ ఉంటుంది.
స్పుత్నిక్‌ వీ
రెండు రకాల లేబుల్స్‌తో ‘స్పుత్నిక్‌ వీ’ వయల్స్‌ ఉంటాయి. టీకా సమాచారం, డిజైన్‌ అంతా ఒకేలా ఉన్నప్పటికీ, తయారీదారు పేర్లు వేర్వేరుగా ఉంటాయి. అక్షరాలన్నీ రష్యా భాషలో ఉంటాయి.
ఐదు వయల్స్‌ కలిగిన ఒక్కో కార్టన్‌ ప్యాక్‌పై ముందు, వెనుక ఇంగ్లిష్‌ అక్షరాలతో లేబుల్స్‌ రాస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img