Friday, June 2, 2023
Friday, June 2, 2023

ఆయనకు మెగా బైట్‌కు, గిగా బైట్‌ కు తేడా కూడా తెలియదు: బాలకృష్ణ

ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్‌ విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ చేతులెత్తేశారని బాలయ్య విమర్శించారు. కేంద్రం నుంచి కనీసం నిధులను కూడా తీసుకురాలేకపోతున్నారని అన్నారు. ముఖ్యమంత్రికి మెగా బైట్‌ కు, గిగా బైట్‌ కు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ప్రజలు ఓట్లేసి వైసీపీని గెలిపించారని… ముఖ్యమంత్రి బాదుడే బాదుడికి గురి కాని వ్యక్తి ఒకరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. జగన్‌ కు పాలించడం చేత కాదని… సలహాదారులను పెట్టుకున్నా, వారి మాటను వినడని విమర్శించారు. సలహాదారులు కూడా ఒకే సామాజికవర్గానికి చెందిన వారని చెప్పారు. తమ మాటను జగన్‌ వినకపోతుండటంతో సలహాదారులంతా జీతాలు తీసుకుంటూ కాలాన్ని గడిపేస్తున్నారని అన్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నెలో బాలయ్య ఈ కామెంట్స్‌ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌ లో ఉన్నారన్నారు. ఏపీలో ఉంది చెత్త ప్రభుత్వమని, రాష్ట్రంలో డ్రగ్స్‌, ల్యాండ్‌ మాఫియా పెరిగిపోయిందని ఆరోపించారు. నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర కోసం బాలయ్య అక్కడికి వెళ్లారు. రాష్ట్రంలో ఎవరూ లేకుండా చేయాలన్నది వైసీపీ కుట్ర అని కూడా మండిపడ్డారు. జనం అంటే వైసీపీకి లెక్కలేదని, జగన్‌ కు పాలన చేతకాదన్నారు. వైస్సార్సీపీ పాలనలో ఏపీ సర్వనాశనమైందని విమర్శించారు. అభివృద్ధి శూన్యం, దోపిడీ ఘనం అన్నట్లుగా పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.‘‘జగన్‌ సీఎం అయ్యాక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యం. పరిశ్రమలు రాలేదు.. ఉపాధి కల్పన జరగలేదు. రాష్ట్రమంతటా ల్యాండ్‌, శాండ్‌ మాఫియా రెచ్చిపోతోంది. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ కేసులతో వేధిస్తున్నారు. రాష్ట్రంలో మళ్లీ సైకో పాలన వస్తే ఏపీ ప్రజలు మరోచోటికి వెళ్లాల్సి వస్తుంది. వైస్సార్సీపీ ఓటమి అంచుల్లో ఉందని జగన్‌కూ తెలుసు. ఆ పార్టీ అరాచకాలను ఎదిరించేందుక ప్రజలంతా ముందుకు రావాలి. టీడీపీ పాలన మళ్లీ వస్తుంది.. అందరి సమస్యలు పరిష్కరిస్తుంది’’ అని బాలయ్య అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img