Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆ నోటిఫికేషన్‌ మేలో ఇస్తాం…

ఎన్డీయేలోకి మహిళల చేర్పింపుపై సుప్రీంలో రక్షణశాఖ
న్యూదిల్లీ : జాతీయ రక్షణ అకాడమీ (ఎన్డీయే)లో చేరేందుకు రాసే ప్రవేశ పరీక్ష కోసం మహిళా అభ్యర్థులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను వచ్చే ఏడాది మే నెలలో జారీ చేస్తామని రక్షణ శాఖ మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. నిర్దేశించిన కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చేర్పింపు ప్రక్రియ, మహిళా అభ్యర్థులకు శిక్షణ సజావుగా జరిగేలా తగు విధంగా ప్రణాళికలు, ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడిరచింది. మహిళా అభ్యర్థుల చేర్పింపునకు భారత ప్రభత్వం కట్టుబడి ఉందంటూ అఫిడవిట్‌ను సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించింది. ఎన్డీయే ప్రవేశ పరీక్షలు ఏటా రెండుసార్లు జరుగుతాయి. 2022 మే కోసం సరైన ఏర్పాట్లు చేయాలని కేంద్రం సూచించింది. వచ్చే ఏడాది మొదటి నోటిఫికేషన్‌ వెలువడే సమయానికి యూపీఎస్‌సీ అవసరం ఉంటుందని వెల్లడిరచింది. ఎన్డీయేలో మహిళా కేడర్‌ కోసం ప్రత్యేకంగా సమగ్ర కరికులాన్ని రూపొందించేందుకు నిపుణులతో కూడిన స్టడీ గ్రూపును ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఎన్డీయేలోకి మహిళలను తీసుకోవాలని సాయుధ దళాలు నిర్ణయించినట్లు ఇంతకుముందే సుప్రీంకోర్టుకు కేంద్రం తెలియజేసింది. కేంద్రం తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భారతి కోర్టుకు హాజరయ్యారు.ఎన్డీయే ద్వారా పర్మినెంట్‌ కమిషన్‌ కోసం మహిళా కేడెట్లను నియమించనున్నట్లు వెల్లడిరచారు. అయితే ఇదే విషయమై న్యాయవాది కుశ్‌ కాల్రా దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం విచారించింది.. 10G2 అర్హతతో అవివాహిత పురుషులకు ఎన్డీయే, నేవల్‌ అకాడమీ ఎక్జామినేషన్‌ ప్రవేశం ఉంటోందిగానీ అర్హులైన మహిళా అభ్యర్థులకు ఆ అవకాశం కేవలం లింగం కారణంగానే కల్పించకపోవడం ఎంత వరకు సమంజసమని పిటిషనర్‌ ప్రశ్నించారు. లింగవివక్షను దుయ్యబట్టారు. మహిళలు, పురుషులు అన్న తేడా లేకుండా అర్హులందరికీ అవకాశమివ్వాలన్నారు. ఈ వ్యవహారాన్ని విచారించిన న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించగా పై అఫిడవిట్‌ను ఏఎస్‌జీ సమర్పించి మహిళా కేడర్‌ నియామకానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వచ్చే ఏడాది మేలో నోటిఫికేషన్‌ జారీ అవుతుందని వివరణ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img