Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

ఏపీలో ప్రభుత్వ వాహనాలకు ఇకపై కొత్త నెంబరు సిరీస్‌

ఏపీలో ప్రభుత్వ వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్‌ నంబర్‌ సిరీస్‌ను తీసుకొచ్చేందుకు రవాణాశాఖ ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది.అందుకోసం మోటార్‌ వాహనాల చట్టంలో సవరణ తీసుకురానున్నారు. అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తెలియజేయాలని కోరింఇ. ఈ చట్ట సవరణ అనుసరించి ప్రభుత్వ వాహనాలకు ఏపీ 40జి అనే కొత్త రిజిస్ట్రేషన్‌ నెంబరు ఇచ్చేందుకు వీలుగా మోటారు వాహనాల చట్టంలో సవరణ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నూతనంగా ప్రభుత్వం కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే ఈ ప్రత్యేక సిరీస్‌ ను కేటాయిస్తారు. 2018 నుంచి రవాణా శాఖ అన్ని జిల్లాలకు కలిపి 39 సిరీస్‌లో నెంబర్లు కేటాయిస్తోంది. ఇకపై నూతన రిజిస్ట్రేషన్‌ సిరీస్‌ తీసుకురావడంతో ప్రైవేటు వాహనాలకు, ప్రభుత్వ వాహనాలకు తేడా స్పష్టంగా తెలుసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img