Friday, August 12, 2022
Friday, August 12, 2022

కాస్త తగ్గిన కరోనా కొత్త కేసులు

కొత్తగా 6,594 మందికి పాజిటివ్‌ కేసులు
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే అంతకుముందు రోజుతో పోల్చితే కొత్త కేసులు 18 శాతం మేర తగ్గాయి. గత మూడు రోజులుగా 8 వేలకుపైగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసులు నేడు 6,594కు పడిపోయాయి.దీంతో మొత్తం కేసులు 4,32,36,695కు చేరాయి. ఇందులో 4,26,61,370 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మరో 50,548 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,771 మంది కరోనాతో మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో 4035 మంది కోలుకున్నారని, 3,21,873 మందికి కరోనా పరీక్షలు చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.12 శాతానికి చేరాయని, రికవరీ రేటు 98.76 శాతం, మరణాల రేటు 1.22 శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.05 కు చేరిందని వెల్లడిరచింది. ఇప్పటిరకు 85.54 కోట్ల కరోనా పరీక్షలు చేశామని, 195.35 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img