Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

కృష్ణమ్మ పరవళ్లు..

పోటెత్తిన సందర్శకులు

శ్రీశైలం ప్రాజెక్టు : ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరదనీరు వస్తుండటంతో శ్రీశైలం జలాశయం నిండు కుండను తలపిస్తోంది. నీటి నిల్వ దాదాపుగా పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతో పది గేట్లను 15 అడుగుల మేరకు ఎత్తి నీటిని దిగువన నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు పర్యాటకులు అధికసంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో సున్నిపెంట నుంచి శ్రీశైలం ఆనకట్ట రహదారులు రద్దీగా మారాయి. వాహనాలను రోడ్ల పక్కనే నిలిపేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిరది. మరోపక్క శ్రీశైల మహాక్షేత్రానికి రద్దీ పెరిగింది. మల్లికార్జునస్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
శ్రీశైలం జలాశయం నీటిమట్టం 885.00 అడుగులు కాగా సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి 883.60 అడుగులుగా నమోదైంది. జలాశయ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత సామర్థ్యం 207.8472 టీఎంసీలుగా ఉంది. జలాశయానికి ఎగువ ప్రాంతాలు జూరాల నుంచి 2,61,075 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 48,768 మొత్తం 4,37,838 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగిస్తూ వరుసగా 29,893 క్యూసెక్కులు, 33,549 క్యూసెక్కుల నీటిని, జలాశయం రేడియల్‌ క్రస్ట్‌ గేట్ల ద్వారా 3,72,710 క్యూసెక్కుల నీటిని అవుట్‌ ఫ్లోగా దిగువకు విడుదల చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img