Friday, June 14, 2024
Friday, June 14, 2024

జైలు నుంచి విడుదలైన ఆర్యన్‌ ఖాన్‌

బాలీవుడ్‌ను కుదిపేసిన క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో అరెస్టయిన ప్రముఖ నటుడు షారూఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ కేసులో ఈ నెల 28న బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే విడుదల ప్రక్రియ ఆలస్యం కావడంతో శనివారం ఉదయం జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆర్యన్‌తోపాటు మరో ఇద్దరు నిందితులు ఆర్బాజ్‌ మర్చంట్‌, మున్‌మున్‌ ధమేచాలకు కూడా బెయిల్‌ లభించింది. కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ను తీసుకెళ్లేందుకు షారుఖ్‌ఖాన్‌, ఆయన సతీమణి గౌరీఖాన్‌ ఆర్థర్‌ రోడ్డు జైలుకు వచ్చారు. ఆ తర్వాత నేరుగా ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఇన్ని రోజుల తర్వాత తనయుడు ఇంటికి చేరుకోవడంతో షారూఖ్‌ ఫ్యామిలీలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. షారూఖ్‌ ఇంటి వద్ద పండగ వాతావరణం ఏర్పడిరది. పెద్ద సంఖ్యలో అభిమానులు షారూఖ్‌ ఇంటి వద్దకు చేరుకుని తమ ఆనందాన్ని పంచుకోవడం గమనార్హం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img