Wednesday, November 30, 2022
Wednesday, November 30, 2022

ట్విటర్‌ బ్లూ టిక్‌కు 8 డాలర్లు చెల్లించాల్సిందే: ఎలాన్‌ మస్క్‌

ట్విటర్‌లో బ్లూ టిక్‌కు డబ్బు చెల్లించాల్సిందేనంటూ వచ్చిన ఊహాగానాలను మస్క్‌ నిజం చేశారు. ట్విటర్‌లో కీలక మార్పులకు ఉపక్రమించిన కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వచ్చిన ఊహాగానాలను నిజం చేస్తూ ‘బ్లూటిక్‌’కు డబ్బులు వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇకపై బ్లూ టిక్‌ కోసం నెలకు 8 డాలర్లు (రూ.661) చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే ఈ ధర ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉండొచ్చని పేర్కొన్నారు. డబ్బులు చెల్లించేవారికి బ్లూటిక్‌తోపాటు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కూడా ఉంటాయని మస్క్‌ తెలిపారు. రిప్లై, మెన్షన్‌, సెర్చ్‌ వంటి ఫిచర్లలో ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. కాగా నెలకు 8 డాలర్లు వసూలు చేయడంపై ట్విటర్‌లో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వీటికీ బదులిచ్చిన మస్క్‌… ‘‘ఫిర్యాదులు చేసేవాళ్లందరికి ఒకటే చెబుతున్నా… దయచేసి మీరు ఫిర్యాదు చేస్తూనే ఉండండి… కానీ దీని ఖరీదు మాత్రం 8 డాలర్లు’’ అంటూ బ్లూ టిక్‌ ఫీజు పెంపుపై తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. కాగా, ఇప్పటివరకు బ్లూ టిక్‌ ఫీజు నెలకు రూ.410గా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img