Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

దిల్లీ పర్యటనతో ఏం సాధించారు?

సీఎం జగన్‌కు రామకృష్ణ సూటిప్రశ్న
ప్రధానితో చర్చల రహస్యమేమిటో వెల్లడిరచాలని డిమాండు

విశాలాంధ్రబ్యూరో`అనంతపురం: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దిల్లీ పర్యటన పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ‘ఉసేనప్ప తాడిమర్రికి పోయాడు…వచ్చాడు’ అన్న సామెతలా ముఖ్య మంత్రి దిల్లీ పర్యటన ఉందని వ్యాఖ్యానించారు. అనంతపురం సీపీఐ కార్యాలయంలో బుధవారం రామకృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోదీని కలిసి కేవలం రూ.2,500 కోట్ల అప్పు వెసులుబాటు కల్పించుకున్నారని విమర్శించారు. మోదీతో జరిగిన చర్చల వివరాలను సీఎం జగన్‌ బహిర్గతం చేయాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. మోదీతో జగన్‌కు గల రహస్య అజెండా ఏమిటని ప్రశ్నించారు. ‘ఎన్నికల సమయంలోఎమ్మెల్యేలతో పాటు 25 మంది ఎంపీలను ఇస్తే హోదా తెస్తామన్నారుకదా? ఏమైంది. ప్రధాని ఏమి చెప్పారు. ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది కదా. విభజన హామీలు ఏమయ్యాయి. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం ఏమైంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదు. బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఖాళీయేనా? వీటిని కనీసం మోదీ వద్ద ప్రస్తావించారా అని ఆయన ప్రశ్నించారు. సీఎం దిల్లీ పర్యటన విఫలైందని, ఇకనైనా కేంద్ర ప్రభుత్వంపై జగన్‌ ప్రభుత్వం పోరాడాల్సిన అవసరం ఉందని సూచించారు. కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రం ఏవిధంగా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు క్షేమంగా లేరని, అన్ని రకాల పంటలు దెబ్బతిన్నాయని, సజ్జల. మంత్రులు మాత్రం రైతులు బాగున్నట్లు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. కంది, ధాన్యం కొనుగోలు చేయడం లేదు. కొన్నవాటికి డబ్బు ఇవ్వడం లేదని విమర్శించారు. రైతాంగాన్ని ఆదుకోవడానికి యుద్ధప్రాతిపదికన బృహత్‌ప్రణాళిక ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. చెత్తపన్నుపై సీనియర్లు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, చెత్త పన్ను, ఆస్తిపన్ను పెంపుదలపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలన్నారు. అమరావతి రాజధాని విషయంలో అనుమానాలకు ఆస్కారం ఇచ్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. స్థానిక ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img