Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశంలో కొత్తగా 15,823 కరోనా కేసులు

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ముందురోజు ఏడు నెలల కనిష్టానికి కొత్త కేసులు తగ్గగా తాజాగా 15 వేలకు చేరాయి. గడిచిన 24 గంటల్లో 15,823 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,40,01,743కు చేరింది. కరోనా వైరస్‌ బారినపడి 226 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో 4,51,189 మంది మృతిచెందారు. కరోనా నుంచి కోలుకుని 22,844 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం యాక్టీవ్‌ కేసుల సంఖ్య 2,07,653గా ఉంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా 96,43,79,212మంది టీకా తీసుకున్నారు. కాగా, అక్టోబర్‌ 12 వరకు దేశవ్యాప్తంగా 58,63,63,442 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) వెల్లడిరచింది. ఇందులో నిన్న ఒకేరోజు 13,25,399 మందికి పరీక్షలు నిర్వహించామని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img