Saturday, May 25, 2024
Saturday, May 25, 2024

దేశంలో కొత్తగా 2,112కరోనా కేసులు

దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కొత్త కేసులు రెండు వేలకు సమీపంలోనే వెలుగుచూస్తున్నాయి. తాజాగా 2,112 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,40,748కి చేరింది. నిన్న ఒక్కరోజే 3,102 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 24,043 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా నలుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 528,957 కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది.ఇక మొత్తం కేసుల్లో 0.05 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.76 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.53 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img