Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

దేశంలో కొత్తగా 37,857 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 37,875 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, 369 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 39,114 మంది పాజిటీవ్‌ బాధితులు కోలుకున్నారు. దేశంలో మొత్తం ఇప్పటి వరకు కేసుల సంఖ్య 3,30,96,718కు చేరింది. ఇందులో 3,22,64,051 మంది వైరస్‌ నుంచి కోలుకోగా, 3,91,256 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,41,411 మంది బాధితులు మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 25,772 కేసులు ఉన్నాయని, 189 మంది మరణించారని తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 70,75,43,018 మందికి టీకా పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img