Friday, March 31, 2023
Friday, March 31, 2023

దేశంలో మరో రెండు రోజులపాటు తీవ్ర చలిగాలులు : ఐఎండి

దేశంలో మూడు నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి చలి పెరిగింది. వాతావరణంలో వచ్చిన ఈ అనూహ్య మార్పు కారణంగా దాదాపు రోజంతా చల్లగానే ఉంటోంది. అయితే, ఇదే పరిస్థితి మరో రెండు రోజులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తెలిపింది. పలు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే, తీవ్ర చలిగాలులు వణికించే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.అలాగే, 29, 31 తేదీల్లో జమ్మూ కశ్మీర్‌, లడఖ్‌, గిల్గిత్‌, బాల్టిస్థాన్‌, ముజఫరాబాద్‌ ప్రాంతాల్లో వర్షాలతో పాటు భారీ హిమపాతానికి అవకాశముందని అధికారులు తెలిపారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి 4 వరకు పశ్చిమ హిమాలయ ప్రాంతంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని వివరించారు. తూర్పు భారతదేశంలో 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img