Monday, August 15, 2022
Monday, August 15, 2022

ధరల పెరుగుదలపై కాంగ్రెస్‌ నిరసన ప్రదర్శన.. రాహుల్‌ గాంధీ, ప్రియాంక నిర్బంధం

కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక, శశి థరూర్‌ ను ఢల్లీి పోలీసులు నిర్బంధించారు. ధరల పెరుగుదల, జీఎస్టీ రేట్ల పెంపు, నిరుద్యోగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం ఢల్లీిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి పోలీసుల అనుమతి లేదు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి భవన్‌ దిశగా దూసుకుపోతున్న రాహుల్‌, థరూర్‌, ఇతర కాంగ్రెస్‌ నేతలను పోలీసులు నిర్బంధించారు. పారామిలటరీ దళాలు, ఢల్లీి పోలీసులు విజయ్‌ చౌక్‌ రోడ్డును బ్లాక్‌ చేశారు. పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్‌ మార్గంలో బ్యారికేడ్లను పెట్టారు. కాంగ్రెస్‌ ఎంపీల నిరసన ప్రదర్శనను నిలువరించడానికి మహిళా పోలీసులను సైతం రంగంలోకి దించారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. మన దేశం ఇప్పుడు నలుగురు వ్యక్తుల నియంతృత్వంలో ఉందని విమర్శలు చేశారు. నల్ల చొక్కాలు ధరించి మరీ కాంగ్రెస్‌ ఎంపీలు నిరసన ప్రదర్శనకు దిగడం గమనార్హం. రాహుల్‌ ను అదుపులోకి తీసుకుని వ్యాన్‌ ఎక్కిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img