Saturday, December 3, 2022
Saturday, December 3, 2022

నెల్లూరులో జిందాల్‌ స్టీల్‌ కంపెనీ

రూ.7,500 కోట్ల పెట్టుబడుల అంచనా
2,500 ప్రత్యక్షంగా, 15వేల మందికి పరోక్షంగా ఉపాధి
860 ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ

నెల్లూరు జిల్లాలో రూ.7,500 కోట్ల పెట్టుబడి అంచనా వ్యయంతో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చిలుకూరు మండలం తమ్మినపట్నం-మోమిడి గ్రామాల పరిధిలో 11.6 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేయనుంది. గతంలో కిన్నెటా పవర్‌కు ఇచ్చిన భూములను ప్రభుత్వం రద్దు చేసి వాటిని జిందాల్‌ సంస్థకు కేటాయించింది.ఈ మేరకు జిందాల్‌ స్టీల్‌ ఆంధ్రా లిమిటెడ్‌ కంపెనీకి 860 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్టీల్‌ప్లాంట్‌తో 2,500 మందికి ప్రత్యక్షంగా, మరో 15వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్లాంట్‌ విస్తరణకు వచ్చే నాలుగేళ్లలో మూడువేల ఎకరాలు అవసరమని అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img