Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

నోరు మెదపనీయడం లేదు


మోదీ సర్కార్‌పై రాహుల్‌ మండిపాటు
ధరల మంట, రైతుల సమస్యలు, పెగాసస్‌ స్పైవేర్‌పై మోదీ సర్కార్‌ విపక్షాలను నోరు మెదపనీయడం లేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు.పార్లమెంట్‌ సమావేశాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. పార్లమెంట్‌ సభ్యులు తమ ప్రజల గళం వినిపించడంతో పాటు జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై చర్చించడం ప్రజాస్వామ్యంలో మౌలిక విధానమని అన్నారు. మోదీ సర్కార్‌ విపక్షాల గొంతునొక్కుతోందని ఆరోపించారు. పెగాసస్‌ అంశంపై చర్చకు విపక్షాలు కలిసికట్టుగా డిమాండ్‌ చేస్తున్నాయన్నారు. పార్లమెంట్‌లో ఈ అంశంపై చర్చకు పట్టుబడుతున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img