Saturday, October 1, 2022
Saturday, October 1, 2022

పదవ తరగతి పాఠ్యాంశంలో అమరావతి తిరిగి చేర్చాలి

సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : పదవ తరగతి తెలుగుపాఠ్య పుస్తకంలో అమరావతి పాఠాన్ని తిరిగి చేర్చేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి బుధవారం ఆయన ఒక లేఖ రాశారు. శతాబ్దాల ఘనచరిత్ర కలిగిన ప్రాం తంగా అమరావతికి చారిత్రక నేపథ్యం ఉందని, శాతవాహనుల రాజధానిగా పేరుగాంచిందని తెలిపారు. బౌద్ధ మతంతోపాటు వివిధ మతా చారాలకు, సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా అమరావతి వెలుగొందిందని పేర్కొన్నారు. చరిత్రను భావితరాలకు అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం నుంచి అమరావతిని తొల గించిందని, 2014లో 12 పాఠాలతో పదవ తర గతి తెలుగు పాఠ్యపుస్తకం ముద్రించగా, అందులో సాంస్కృతిక వైభవం ఇతివృత్తంగా రెండో పాఠంగా అమరావతి ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు కొత్తగా పాఠశాల విద్యాశాఖ అమరావతి పాఠాన్ని తొలగించి, మిగిలిన 11 పాఠాలతోనే పుస్తకాలు ముద్రించిందన్నారు. కొత్తగా ముద్రించిన పుస్తకా లను పాఠశాల విద్యాశాఖ ఆయా స్కూళ్లకు పంపగా, పాఠశాల వారు పాత పుస్తకాలను తీసుకుని కొత్తగా ముద్రించిన పుస్తకాలను విద్యార్థులకు ఇచ్చార న్నారు. పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం నుంచి అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించడం సరికాదని, విద్యావేత్తలు, నిపుణులతో ఏమాత్రం చర్చించకుండా విద్యాశాఖ హడావుడి నిర్ణయాలు చేసి, తనకు నచ్చిన రీతిలో విద్యా విధానాన్ని, పాఠ్యాంశాలను మార్చేయడం తగదన్నారు. విద్యా ర్థులకు శాస్త్ర, సాంకేతిక, చారిత్రక నేపథ్యాలను సమగ్రంగా అందించాల్సిన విద్యాశాఖ ఈ విధంగా అనాలోచిత విధానాలు అవలంబించడాన్ని ఆయన ఖండిరచారు. అమరావతి రాజధానిని వ్యతిరేకిస్తూ మీరు మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకు వచ్చారు కాబట్టి పాఠ్యపుస్తకాలలో అమరావతి ప్రస్తావన ఉండకూడదనే ఆలోచనతో వ్యవహరిస్తు న్నారని తెలిపారు. అమరావతి అన్న పదంపైనే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వివక్షతకు ఇది అద్దం పడుతోందన్నారు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనే విధంగా వైసీపీ ప్రభుత్వానికి ముందు, ఆ తర్వాత అనే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వ పాలన నిరంకుశ విధానాలతో సాగడం అత్యంత విచారకరమన్నారు. చారిత్రకంగా ఎంతో విశిష్టత కలిగిన అమరావతి వైభవం గురించి నేటి విద్యార్థులకు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో అమరావతి పాఠ్యాంశాన్ని తిరిగి చేర్చేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.
అమరావతి పాఠం తొలగింపు దారుణం
`టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌
పదో తరగతి నుంచి అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించడం దారుణమని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. అమరావతి ఆంధ్రుల ఆత్మవిశ్వాసానికి, ఆత్మాభిమానానికి ప్రతీకని, అలాంటి రాజధానిని ఛిన్నాభిన్నంచేసే క్రమంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు దారుణంగా ఉన్నాయన్నారు. ఒక చరిత్రను భావితరాలు పూర్తిగా మర్చిపోయేలా, పాఠ్యాంశంగా ఉన్న అమరావతి అంశాన్ని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించడం అన్యాయన్నారు. అమరావతికి అనుకూలమని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి రాజధానిని ఒక సామాజికవర్గానికే చెందిందని దుష్ప్ర చారం చేయడం సరికాదన్నారు. అమరావతి నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, గతంలోనే దానికి అన్ని ప్రాంతాలతో కలిసేలా రోడ్ల కనెక్టివిటీని కూడా పూర్తిచేయడం జరిగిం దన్నారు. అమరావతికోసం 175మంది రైతులు, రైతుకూలీలు ప్రాణాలు కోల్పోయారన్నారు. జగన్‌ ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాలని, రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండు చేశారు.
సిగ్గుచేటు: అమరావతి బహుజన జేఏసీ
అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించడం సిగ్గుచేటని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య విమర్శించారు. శాతవాహనులు, చాళుక్యులు మౌర్యులు వంటి రాజుల ప్రాశస్త్యం, కళావైభవం, బుద్ధ భగవానుడి ప్రవచనాలు, కృష్ణ నదీతీరంలో ధాన్యకటకం వంటి చారిత్రక సంపద తెలుగు చరిత్రలో మరొకటి లేదని తెలిపారు. చరిత్ర ఎప్పుడూ ఒకరు తొలగిస్తే తొలగిపోదన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img