Friday, May 31, 2024
Friday, May 31, 2024

పనిచేయని మోదీ ‘పకోడా’ మంత్రం

ఎనిమిదేళ్లుగా పేదరికాన్ని పెంచిన వైనం

పకోడీలు అమ్ముకొని బతకొచ్చు అని ప్రధాని మోదీ గొప్పగా చెప్పారు. అయితే ఈ మంత్రా కడుపు నింపటానికి, కుటుంబ పోషణకు ఏ మాత్రం పనిచేయదని వాస్తవపరిస్థితులు చెబుతున్నాయి. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో పేదరికం అనేకరెట్లు పెరిగిందని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. భారత్‌లో పేదరికం అంచనాలు మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు మొదటిసారిగా పేదల సంఖ్యలో పెంపుదల నమోదు అయింది.

న్యూదిల్లీ : పకోడీలు అమ్ముకొని బతకొచ్చు అని ప్రధాని మోదీ గొప్పగా చెప్పారు. అయితే ఈ మంత్రా కడుపు నింపటానికి, కుటుంబ పోషణకు ఏ మాత్రం పనిచేయదని వాస్తవపరిస్థితులు చెబుతున్నాయి. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో పేదరికం అనేకరెట్లు పెరిగిందని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. భారత్‌లో పేదరికం అంచనాలు మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు మొదటిసారిగా పేదల సంఖ్యలో పెంపుదల నమోదు అయింది. దేశంలోని గ్రామీణ పేదల సంఖ్య 2012లో 217 మిలియన్లుగా ఉంటే 201920లో అది 283 మిలియన్లకు చేరుకుంది. అలాగే, పట్టణాల్లోని పేదల సంఖ్య 53 మిలియన్ల నుంచి 63 మిలియన్లకు పెరిగింది. అంటే ఎనిమిదేళ్లలో (2020 జూన్‌ వరకు) పేదల సంఖ్యలో 76 మిలియన్ల పెంపుదల నమోదు అయింది. పకోడీలు అమ్ముకుంటే ఉపాధి లభించినట్లు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. 2018లో భారత్‌లో నిరుద్యోగులు పెరగడంపై మోదీని ప్రశ్నిస్తే, ‘ ఓ వ్యక్తి మీ (వ్యాఖ్యతనుద్దేశించి) కార్యాలయం ఎదుట పకోడీలు అమ్మితే అది ఉపాధి పొందుతున్నట్లు కాదా? ఆ వ్యక్తి రోజుకు రూ.200 సంపాదిస్తే అది లెక్కలోకి రాదా.. ఇదే తరహాలోనే అనేకమంది ఉపాధి పొందుతున్నారు’ ఇలాంటి అన్నీ ఉపాధి లెక్కల్లోకి రావు’ అని ప్రధాని బదులిచ్చారు. అంటే రోజుకు రూ.200 (నెలకు రూ.6వేలు) సంపాది ంచి ఐదుగురితో కూడిన కుటుంబాన్ని పోషించుకోవచ్చు అని ఆయనన్నారు. అయితే అధికారిక గణాంకాలను చూసినట్లయితే 201720లో గ్రామీణ స్వీయ ఉపాధిదారుని దినసరి ఆదాయం రూ.21.1 నుంచి రూ.19.9కు తగ్గింది. పట్టణాల్లోనూ ఆదాయంలో పెద్దగా మార్పు లేదు. భారత్‌లో దారిద్య్ర రేఖ దిగువనున్న వారి సమాచారాన్ని చూస్తే 201920లో ఐదుగురి కుటుంబ ఆదాయం రూ.7,340గా ఉంది. ఈ లెక్కన పకోడీలు అమ్మేవారు పట్టణ ప్రాంత పేదరికం రేఖ ఆదాయం కంటే 18శాతం తక్కువగా ఉంది. వారి నెలసరి ఆదాయం/ వ్యయాలు కూడా గ్రామీణ పేదరికం రేఖ దిగువనే ఉన్నాయి. 201112 నుంచి పేదలపై సీఈఎస్‌ సర్వే డేటాను ప్రభుత్వం విడుదల చేయడంలేదు. జాతీయ సర్వే సంస్థ (ఎస్‌ఎస్‌ఓ) ప్రతి ఐదేళ్లకు ఈ సర్వే నిర్వహిస్తుంది. 201718 సీఈఎస్‌ సర్వే వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. 19732012లో పేదరికం గణనీయంగా తగ్గింది. 197374లో దేశ పేదలు 54.9శాతంగా ఉంటే 198384లో 44.5శాతంగా, 199394లో 36శాతం గా, 200405లో 27.5శాతానికి వారి సంఖ్య తగ్గింది. ప్లానింగ్‌ కమిషన్‌ సభ్యుడు, ప్రముఖ ఆర్థికవేత్త పేరుపై లఖడావాలా ప్రావర్టీ లైన్‌ ఆధారంగా ఈ మేరకు అంచనా వేశారు. 2011లో జాతీయ దారిద్య్ర రేఖ పరిధిని దిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ (అప్పటి) ప్రొఫెసర్‌ సురేశ్‌ టెండూల్కర్‌ చైర్మన్‌గా ఉన్న నిపుణుల సంఘం సిఫార్సుల మేరకు కాస్త పెంచారు. భారత జనాభాలో దాదాపు 65శాతం మంది గ్రామాల్లో , పేదరికంలో ఉండే వారే ఉన్నారు. 201920 (2020 జూన్‌ వరకు) గ్రామాలతో పాటు పట్టణాల్లో పేదరికం పెరిగిపోయింది. 201718 సీఈఎస్‌ డేటా లీకేజి ఆధారంగా ఈ పెంపుదల స్థిరంగా ఉన్నట్లు తెలిసింది. లీకైన డేటా ప్రకారం 201218లో గ్రామీణ వినియోగం ఎనిమిది శాతానికి పడిపోగా పట్టణాల్లో రెండు శాతం మేర పెరిగింది. మరోవైపు 200405Ñ 201112 మధ్యకాలంలో పేదల సంఖ్య 137 మిలియన్లకు చేరుకుంది. అంటే ఏటా దాదాపు 20 మిలియన్ల పేదలు తగ్గుతూ వచ్చారు. ఇది భారత్‌ వృద్ధిపెంపునకు కట్టుబడి ఉండటం వల్లనే సాధ్యమైంది. 2004, 2014లో జీడీపీ వృద్ధిరేటు ఏటా సగటున ఎనిమిది శాతంగా ఉంది. 20152019లో అది ఆరు శాతం కంటే తక్కువగా నమోదు అయింది. ఈ క్రమంలో దేశంలో పేదరికం పెరిగింది. ఇక నిరుద్యోగం కూడా గణనీయంగా పెరిగింది.
యువత నిరుద్యోగిత రేటు 201220లో 6.1శాతం నుంచి 15శాతానికి చేరుకుంది. ఇది కూడా పేదరికం పెరగటానికి దోహదపడిరది. అనేక రంగాల్లో వేతనాల కోత కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. శ్రామికుల్లో పావు వంతు సగటు కార్మికులు ఉంటే మరో పావు వంతు క్యాజువల్‌ వేజ్‌ వర్కర్లు ఉన్నారు. సగం మంది స్వీయ ఉపాధి పొందేవారు ఉన్నారు. పట్టణాల్లో వేతనజీవుల వేజ్‌రేటు రూ.186కి తగ్గింది. ఇది 20052012లో రూ.226గా ఉంది. అప్పట్లో వ్యవసాయేతర ఉద్యోగాల్లో పెంపుదల నమోదు అయింది. అటు గ్రామాల్లో వేతన జీవుల వేజ్‌ రేటు 20122020లో రూ.48 నుంచి రూ.41కు పడిపోయింది. క్యాజువల్‌ దినసరి వేతన కార్మికుల వాస్తవ జీతాలు 20122020లో గ్రామాల్లో రూ.22 నుంచి రూ.26కు, పట్టణాల్లో రూ.87 నుంచి రూ.102కు పెరిగాయి. స్వీయ ఉపాధి పొందే వారి దినసరి వేతనం రూ.21.1 నుంచి రూ.19.9కు తగ్గింది. పట్టణాల్లో 2017`2020లో రూ.139.9 నుంచి రూ.141.3కి స్వల్పంగా పెరిగింది. దీనిని బట్టి మోదీ చెప్పిన పకోడా ఫార్ములా పనిచేయదని స్పష్టమైంది. ఈ క్రమంలో అధిక ఉద్యోగావకాశాల కల్పన అనివార్యమని తేలిపోయింది. ఇదిలావుంటే, పకోడీలు అమ్ముకోవడాన్ని స్వీయ ఉపాధిగా పరిగణిస్తే భిక్షాటనను కూడా అలాగే చూడాలని ఓ విపక్ష పార్టీ ఎద్దేవా చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img