Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

పార్లమెంటు.. మీరే కాదు .. మేమూ నిర్వహించగలం..

అది చెప్పేందుకే కిసాన్‌ సంసద్‌ : అన్నదాతల స్పష్టీకరణ
నల్ల చట్టాల రద్దుపై దద్దరిల్లిన రైతు సభ
గట్టి భద్రతా నడుమ ‘సాగు’ పోరు : జంతర్‌ మంతర్‌కు 200 మంది
పహారా మధ్య కార్యకలాపాలు ` 20 మంది ఎంపీల సంఫీుభావం


కేంద్రానికే కాదు రైతులకూ పార్లమెంటును ఎలా నిర్వహించాలో తెలుసు అని, అది చాటిచెప్పేందుకే కిసాన్‌ సంసద్‌ (రైతుల పార్లమెంటును) ఏర్పాటు చేశామని రైతు నేతలు తెలిపారు. తమ ఉద్యమం సజీవంగా ఉందని, హక్కులను సాధించుకునేంత వరకు వెనక్కు తగ్గమని కిసాన్‌ సంసద్‌ ద్వారా స్పష్టంచేశారు. పోలీసుల భద్రతా వలయంలో జంతర్‌ మంతర్‌ వద్ద 200 మందితో కిసాన్‌ సంసద్‌ జరిగింది. మహారాష్ట్ర, ఒడిశా, కేరళ, పశ్చిమ బెంగాల్‌, తెలంగాణ, గుజరాత్‌, పంజాబ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ సహా మరికొన్ని రాష్ట్రాల రైతు నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. సంసద్‌లో ఏపీఎంసీ చట్టంపైనా రైతులు చర్చించారు. చర్చలో మహిళలు,

వృద్ధులు పాల్గొన్నారు. 20 మంది ఎంపీలు సందర్శించి సంఫీుభావం తెలిపారు. కొత్త సాగు చట్టాల రద్దు, ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పన డిమాండ్లతో ‘కిసాన్‌ సంసద్‌’ దద్దరిల్లిపోయింది. గురువారం 200 మంది రైతులు, యూనియన్ల జెండాలు చూబూని మెడలో ఐడీలు వేసుకొని సింఘు సరిహద్దు నుంచి నాలుగు బస్సుల్లో జంతర్‌ మంతర్‌ వద్దకు పోలీసు రక్షణలో చేరుకున్నారు. ఉదయం 11 గంటలకే ఆందోళన ప్రారంభం కావాల్సి ఉండగా రైతులు చేరుకునే సరికి మధ్యాహ్నం 12.10 గంటలైంది. ఆలశ్యంగా మొదలైనాగానీ కిసాన్‌ సంసద్‌ మొదటిరోజు విజయవంతంగా సాగినట్లు రైతు నాయకులు తెలిపారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని ఈ సంసద్‌ ద్వారా మరోమారు గళాన్ని వినిపించినట్లు తెలిపారు. పార్లమెంటు నిర్వహణ కేంద్రానికే కాదు తమకు తెలుసని చెప్పేందుకే కిసాన్‌ సంసద్‌కు పూనుకున్నట్లు వెల్లడిరచారు. ఆ ప్రాంతంలో పోలీసులు వేలాది సంఖ్యలో మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రైతు నేత రమీందర్‌ సింగ్‌ పాటియాలా మాట్లాడుతూ, ‘సంసద్‌ (పార్లమెంటు/సభ) మూడు సెషన్లు ఉంటాయి. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌గా ఆరుగురు ఉంటారు. మొదటి రోజును రైతు నేతలు హన్నన్‌ మొల్లా, మంజీత్‌ సింగ్‌లు సభాపతులుగా వ్యవహరించారు’ అని చెప్పారు. మరొక నేత శివకుమార్‌ కక్కా మాట్లాడుతూ, మాట్లాడాలనుకున్న వారు ముందే తమ పేర్లను స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌లకు ఇస్తున్నారు. మధ్యాహ్నా భోజన విరామం, టీబ్రేక్‌ ఉంటాయి. అవసరమైనవన్నీ మా వద్ద ఉన్నాయి’ అని చెప్పారు. ‘మా ఉద్యమం సజీవంగా ఉందని, మా హక్కులను సాధించుకునేంత వరకు వెనక్కు తగ్గమని కిసాన్‌ సంసద్‌ ద్వారా చెప్పదలిచాం’ అని కక్కా అన్నారు. బీకేయూ నేత రాకేశ్‌ తికైత్‌ మాట్లాడుతూ, దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన/ధర్నా చేస్తున్నది రైతులే అని గుర్తించేందుకు ప్రభుత్వానికి ఎనిమిది నెలలు పట్టింది. పార్లమెంటు కార్యకలాపాలను ఏ విధంగా సాగించాలో రైతులుకూ తెలుసు. ప్రస్తుతం పార్లమెంటులో ఉన్న అధికారవిపక్షాలుగానీ మా అంశాలను లేవనెత్తని పక్షంలో వారి నియోజకవర్గాల్లో మేము గళమెత్తుతాం’ అని హెచ్చరించారు. హన్నన్‌ మొల్లా మాట్లాడుతూ, మూడు సాగు చట్టాలపై పార్లమెంటు దద్దరిల్లిందని అన్నారు. పార్లమెంటులో చర్చ లేకుండా నల్ల చట్టాలను ఆమోదించారని, కిసాన్‌ సంసద్‌ ద్వారా వాటిని తిరస్కరిస్తామని చెప్పారు. రైతుల సమస్యలపై పార్లమెంటు లో గొంతు వినిపించాలని ప్రతిపక్ష ఎంపీలందరికీ లేఖలు రాసినట్లు వెల్లడిరచారు. ‘మా వాళ్లు ఎందరినో కోల్పోయి ఇంత వరకు వచ్చాం. దీర్ఘకాలపోరునకు సంసిద్ధమై ఉన్నాం’ అని బీకేయూ (చౌదుని) నేత హర్పాల్‌ సింగ్‌ అన్నారు. పాకిస్థాన్‌ నుంచి వచ్చే బస్సును కూడా ఇంతలా తనిఖీ చేయరేమో.. రైతులను వేధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లుంది అని అసహనం వ్యక్తంచేశారు. 20 మంది ఎంపీలు కిసాన్‌ సంసద్‌ను సందర్శించి సంఫీు భావం తెలిపినట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించి ంది. ఆగస్టు 13 వరకు నిత్యం 200 మంది రైతులు ఆందోళనలో పాల్గొంటారని రైతు నేతలు తెలిపారు. తొలుత కిసాన్‌ సంసద్‌కు మీడియాను అనుమతించలేదు. తర్వాత వారి ఐడీలను తనిఖీ చేసి అనుమతిచ్చారు. ఇదిలావుంటే ఆగస్టు 9న 200 మందితో జంతర్‌ మంతర్‌ వద్ద ప్రదర్శనకు ప్రత్యేక అనుమతిని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ ఇచ్చినట్లు రైతు నేతలు తెలిపారు. మాపైనా నిఘానేత్రం!? : తమపై పెగాసస్‌ నిఘానేత్రం ఉన్నదన్న అనుమానం కలుగుతోందని రైతు నేతలు అన్నారు. ‘ఇది అనైతిక ప్రభుత్వం.. మా ఫోన్‌ నంబర్లూ లక్షిత జాబితాలో ఉన్నట్టు అనుమానం ఉంది. ఈ స్నూపింగ్‌ వెనుక సర్కార్‌ ఉందన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఈ వ్యవహారం పెద్దది అవుతోంది. వాళ్లు మాపైనా నిఘా పెట్టారని తెలుసు’ అని శివకుమార్‌ కక్కా అన్నారు. 202021 డేటా వెలుగు చూస్తే అందులో రైతు నేతల ఫోన్‌ నంబర్లు కచ్చితంగా ఉంటాయని, అందులో సందేహం లేదని స్వరాజ్‌ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్‌ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img