Monday, April 22, 2024
Monday, April 22, 2024

పార్లమెంట్‌కు సైకిల్‌పై టీఎంసీ ఎంపీలు


కొవిడ్‌ నిబంధనల మధ్య పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పెట్రో ధరల పెరుగుదలను నిరసిస్తూ.. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు ఇవాళ పార్లమెంట్‌కు సైకిల్‌పై వచ్చారు. కొన్ని నెలల నుంచి నిత్యం పెట్రోల్‌ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. అనేక నగరాల్లో ప్రస్తుతం లీటర పెట్రోల్‌ ధర వంద రూపాయాలు దాటింది. 61 సౌత్‌ అవెన్యూ నుంచి తృణమూల్‌ ఎంపీలు సైకిల్‌పై పార్లమెంట్‌కు వచ్చారు. కాగా లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడిరది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకింగా ఆప్‌ వాయిదా తీర్మానం ఇచ్చారు. దీంతోపాటు నూతన వ్యవసాయ చట్టాలపై చర్చ జరపాలని కాంగ్రెస్‌, సీపీఎం సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img