Friday, December 2, 2022
Friday, December 2, 2022

బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్‌ను ఓడిరచాలి

బ కార్పొరేట్‌`మతఫాసిస్టు శక్తులపై పోరు ఉధృతం
బ కమ్యూనిస్టువామపక్ష ఐక్యత బలోపేతం
బ 2025 నాటికి పది లక్షలకు పార్టీ సభ్యత్వం
బ సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా పిలుపు

న్యూదిల్లీ: దేశంలో లౌకికవాదానికి, ప్రజాస్వామ్యానికే కాకుండా రాజ్యాంగానికీ ముప్పుగా ఉన్న బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌ రెండిరటినీ ఓడిరచడమే తక్షణ కర్తవ్యమని పార్టీ శ్రేణులకు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. ఆ దిశగా ఉద్యమాలను తీవ్రతరం చేయాలని సూచించారు. బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌ ఓటమితోనే దేశప్రజలను వినాశనం నుంచి కాపాడవచ్చు అని అన్నారు. ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయం అజయ్‌భవన్‌లో గురువారం రాజా విలేకరుల సమావేశంలో మాట్లాడారు.సమావేశంలో పార్టీ కార్యదర్శులు వినయ్‌ విశ్వం, అమర్‌జిత్‌ కౌర్‌ పాల్గొన్నారు. ఈ నెల 1418 తేదీలలో విజయవాడలో జరిగిన సీపీఐ 24వ జాతీయ మహాసభలలో చేసిన నిర్ణయాలు, ఆమోదించిన తీర్మానాలు, నూతన కమిటీ ఎన్నిక వివరాలను వెల్లడిరచారు. జీవనోపాధి, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి, ఇల్లు, ఆహారం, స్థలం వంటి ప్రాథమికాంశాలను దృష్టి పెట్టుకోవడం ద్వారా పౌరులకు గౌరవ జీవితం, హక్కులకు హామీ ఇవ్వగలమన్నారు. మార్క్సిజంలెనినిజం అమలు అవశ్యమని, దోపిడీ, కుల వ్యవస్థ నిర్మూలన, పితృస్వామ్యానికి చెక్‌ పెట్టడం కోసం పోరాటాలను పార్టీ మరింత ఉధృతం చేయాలని రాజా పిలుపునిచ్చారు. 2025లో పార్టీ శతాబ్ది ఉత్సావాలు జరుపుకోనున్నదని ఆనాటికి పార్టీ మరింత బలోపేతం కావాలని, పది లక్షల సభ్యత్వాన్ని కలిగివుండాలనిÑ పార్లమెంటుతో పాటు రాష్ట్ర శాసనసభలు, స్థానిక సంస్థల్లో సముచిత ప్రాతినిధ్యం ఉండాలన్నారు. వామపక్ష ఐక్యతకమ్యూనిస్టు ఐక్యత బలోపేతానికి మహాసభలు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. కార్పొరేట్‌మతఫాసిస్టు శక్తులపై పోరాటానికి కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యత కీలకమని చెప్పారు. సిద్ధాంతాలు ఆధారంగా కమ్యూనిస్టు ఉద్యమం ఏకీకరణను సీపీఐ జాతీయ మహాసభ పునరుద్ఘాటించినట్లు తెలిపారు.
దేశాన్ని అగాధంలోకి నెట్టివేసేలా వినాశకర విధానాలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ పతనం అంచునకు చేరుకున్నదని, రూపాయి మారక విలువతో పాటు దేశ ప్రతిష్ఠ దిగజారుతోందని, నిరుద్యోగం తారాస్థాయికి చేరుకోవడంతో యువతలో అసహనం పెరిగిందని, ప్రపంచ ఆకలి సూచీలో స్థానం సిగ్గుచేటు అని అన్నారు.
ద్రవ్యోల్బణం దూసుకెళుతోందని, దేశ సంపద, ఆస్తులను కార్పొరేట్లతో పాటు బడా వ్యాపార సంస్థలు దోచుకుంటున్నాయని, ప్రభుత్వరంగ సంస్థల నిర్వీర్యం, పీఎస్‌యూల ప్రైవేటీకరణ కోసం కేంద్రం పట్టుదలగా ఉన్నదని విమర్శించారు. లౌకిక, సంక్షేమ, సమాఖ్య దేశంగా భారత్‌కున్న గుర్తింపును రద్దు చేసేలా బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌ దూకుడు ప్రదర్శిస్తున్నాయన్నారు. దళితులు, గిరిజనులు, మైనారిటీలపై దురాగతాలు పేట్రేగిపోతున్నాయని, పౌరుల ప్రజాస్వామిక, రాజ్యాంగబద్ధ హక్కుల హరణ కొనసాగుతోందని, కార్పొరేట్‌మతఫాసిజం ఆవిర్భావానికి సాక్షిగా దేశం నిలిచిందని రాజా ఆందోళన వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img