Monday, December 5, 2022
Monday, December 5, 2022

భారీగా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైన మెటా..!

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ ఇటీవల కంపెనీలో సుమారు 50 శాతం మంది ఉద్యోగులపై వేటువేసిన విషయం తెలిసిందే. తాజాగా, ఫేస్‌బుక్‌ మాతృసంస్థ ‘మెటా’ సైతం ట్విట్టర్‌ బాటలోనే పయనిస్తున్నట్లు తెలుస్తోంది. వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపునకు ‘మెటా’ కూడా సిద్ధమైనట్లు సమాచారం. ఈ వారంలో ఉద్యోగులకు పెద్ద ఎత్తున లేఆఫ్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం వెలువరించింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఉద్యోగి ఒకరు ఈ విషయం చెప్పినట్టు తన కథనంలో పేర్కొంది. వేలాదిమంది ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధమైందని, నవంబర్‌ 9 నాటికి ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన ప్రకటన వెలువడచ్చని తెలిపింది. మరోవైపు సెప్టెంబరు చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 87వేల మందికిపైగా ఉద్యోగులు సంస్థలో ఉన్నట్టు మెటా పేర్కొంది. తాజాగా కంపెనీ విధిస్తున్న ఉద్యోగుల కోతలు వేల సంఖ్యలోనే ఉండొచ్చని వాల్‌స్ట్రీట్‌ తన కథనంలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img