Friday, May 31, 2024
Friday, May 31, 2024

మణిపూర్‌లో ‘డబుల్‌ ఇంజిన్‌’ అభివృద్ధి


ప్రధాని మోదీ
న్యూదిల్లీ : మణిపూర్‌ పురోగతికి అడ్డంకులు తొలగిపోయాయని, వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నొక్కి చెప్పారు. 70 ఏళ్లుగా మణిపూర్‌ను అణచివేసిన శక్తులను మళ్లీ తలదూర్చేందుకు అనుమతించవద్దని ఆ రాష్ట్ర ప్రజలను కోరారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ మణిపూర్‌ శాంతికి అర్హమైనది, తరచుగా జరిగే బంద్‌లు, దిగ్బంధనాల నుంచి బయటపడటానికి కూడా అర్హమైనదని, ముఖ్యమంత్రి ఎన్‌.బీరెన్‌ సింగ్‌ నాయకత్వంలో ఇది సాధించబడిరదని తెలిపారు. ఫిబ్రవరి 27, మార్చి 3న అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ‘మణిపూర్‌ 50 ఏళ్ల తర్వాత (రాష్ట్ర హోదా) కీలకమైన దశలో ఉంది. వేగంగా అభివృద్ధి దిశగా ప్రయాణం ప్రారంభించింది. ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. మనం ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే సరికి మణిపూర్‌ రాష్ట్రంగా ఏర్పడి 75 ఏళ్లు అవుతుంది’ అని ప్రధాని అన్నారు. ‘మణిపూర్‌ అభివృద్ధికి ఇది ‘అమృత కాలం’ కూడా. దాని పురోగతిని నిలిపివేసిన శక్తులు తమ వినికిడిని పెంచుకోవడానికి అనుమతించకూడదు. మనం దీనిని గుర్తుంచుకోవాలి… అభివృద్ధి డబుల్‌ ఇంజన్‌తో, మణిపూర్‌ వేగంగా అభివృద్ధి చెందాలి’ అని ఆయన పిలుపు ఇచ్చారు. కాగా మణిపూర్‌లో ఎక్కువ కాలం రాజకీయాలలో కాంగ్రెస్‌ ఆధిపత్యం చెలాయించగా, బీజేపీ 2017లో మొదటిసారి అక్కడ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు దానిని నిలుపుకోవాలని చూస్తోంది. మోదీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అంచనాలు, ఆకాంక్షల గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి తాను నిరంతరం కృషి చేశానని, దీని వల్ల వారి భావాలు, నిరీక్షణలను బాగా అర్థం చేసుకోవడానికి, వారి సమస్యలను పరిష్కరించడానికి మార్గాలను కనుగొనగలిగానని చెప్పారు. మణిపూర్‌ను దేశానికి క్రీడా శక్తిగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈశాన్య ప్రాంతాలను యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీకి కేంద్రంగా మార్చే దృక్పథంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని అన్నారు. రాష్ట్రానికి దేశంలోనే తొలి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం లభించిందంటూ, యువత క్రీడా సామర్థ్యాలను కొనియాడారు. రాష్ట్ర యువత స్టార్టప్‌లు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ రంగంలో కూడా బాగా రాణిస్తున్నారని తెలిపారు. ‘డబుల్‌ ఇంజన్‌’ అభివృద్ధి కింద మణిపూర్‌కు రైల్వేలు వంటి సౌకర్యాలు అందుతున్నాయని, ప్యాసింజర్‌ రైలు కోసం రాష్ట్ర ప్రజలు 50 ఏళ్ల పాటు ఎదురుచూడాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రంలో జిరిబామ్‌-తుపుల్‌-ఇంఫాల్‌ రైల్వే లైన్‌ సహా వేల కోట్ల రూపాయల విలువైన అనుసంధాన ప్రాజెక్టులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇంఫాల్‌ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా లభించడంతో దిల్లీ, కోల్‌కతా, బెంగళూరులతో ఈశాన్య రాష్ట్రాల అనుసంధానం మెరుగుపడిరది. భారతదేశం-మయన్మార్‌-థాయ్‌లాండ్‌ త్రైపాక్షిక రహదారి, ఈ ప్రాంతంలో రాబోయే రూ.9 వేల కోట్ల సహజవాయువు పైప్‌లైన్‌ ద్వారా మణిపూర్‌ కూడా ప్రయోజనం పొందుతుందని ప్రధాని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img