Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

మరో ఉద్యమానికి రైతాంగం సిద్ధం కావాల్సిన తరుణమిది

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన అనాలోచిత విధానాలకు తలొగ్గి జగన్‌ సర్కార్‌ రైతులకు ద్రోహం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మండిపడ్డారు. మరో ఉద్యమానికి రైతాంగం సిద్ధం కావాల్సిన తరుణమిది అని వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి చెప్పినట్లుగా స్మార్ట్‌ మీటర్ల కోసం ఖర్చయ్యే రూ.1150 కోట్లు ఎవడబ్బ సొమ్మని ప్రశ్నించారు. నిజంగా రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలనుకుంటే స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు ఎందుకని నిలదీశారు. కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా ఖర్చు చేయాల్సిన అవసరమేముందని అడిగారు. విద్యుత్‌ మీటర్లు రైతుల మెడకు ఉరితాళ్ళు కానున్నాయని తెలిపారు. రైతులకు అన్యాయం జరుగుతుందనే తెలంగాణలో ప్రభుత్వం మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించిందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img