Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మరో రెండు రోజులు వర్షాలు

తీర ప్రాంతాల్లో 40 కిలోమీటర్ల వేగంతో గాలులు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్‌ తీరం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడిరచింది. బంగ్లాదేశ్‌ పరిసర ప్రాంతాల నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఫలితంగా రెండు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడతాయని పేర్కొంది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. గంటకు సుమారు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడిరచింది. సోమవారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img