Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

రాఫెల్‌ పాపం మోదీదే..

ఎన్డీయే హయాంలోనే ఒప్పందంపై తుది నిర్ణయం

విచారణకు సీబీఐ దూరం..
అవినీతిపై పత్రాలు ఉన్నా దర్యాప్తులో విఫలం
ఫ్రెంచ్‌ న్యూస్‌ పోర్టల్‌ తాజా నివేదిక

న్యూదిల్లీ : ఫ్రాన్స్‌ కంపెనీకి చెందిన ‘రాఫెల్‌’ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణం వ్యవహారం మరో మలుపు తిరిగింది. దీనిపై ఫ్రెంచ్‌ మీడియా పోర్టల్‌ తాజా విషయాలను బయటపెట్టింది. భారత్‌కు 36 రాఫెల్‌ యుద్ధ విమానాలను విక్రయించడంలో సహాయపడటానికి ఫ్రెంచ్‌ విమానాల తయారీ సంస్థ డస్సాల్ట్‌ ఒక మధ్యవర్తికి కనీసం 7.5 మిలియన్‌ యూరోలు (దాదాపు 65 కోట్లు) లంచంగా చెల్లించింది. అయితే ఆ కుంభకోణానికి సంబంధించిన పత్రాలు ఉన్నప్పటికీ భారత సంస్థలు దర్యాప్తు చేయడంలో విఫలమయ్యాయని ఫ్రెంచ్‌ పోర్టల్‌ మీడియాపార్ట్‌ ఒక కొత్త నివేదికలో పేర్కొంది. రూ.59 వేల కోట్ల విలువైన రాఫెల్‌ ఒప్పందంలో అవినీతి ఆరోపణలపై ఈ ఆన్‌లైన్‌ జర్నల్‌ దర్యాప్తు చేస్తోంది. మధ్యవర్తిగా ఆరోపించబడుతున్న సుషేన్‌ గుప్తాకు రహస్య కమీషన్లు చెల్లించడానికి తప్పుడు ఇన్వాయిస్‌లు సృష్టించేందుకు డస్సాల్ట్‌ను ప్రారంభించినట్లు మీడియా పార్ట్‌ పేర్కొంది. ‘ఈ పత్రాలు ఉన్నప్పటికీ, భారత పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ జరపకూడదని నిర్ణయించుకున్నారు. దర్యాప్తును ప్రారంభించలేదు’ అని వివరించింది. మీడియాపార్ట్‌ నివేదిక ప్రకారం, రాఫెల్‌ జెట్‌ల అమ్మకానికి సంబంధించి డస్సాల్ట్‌ సుషేన్‌ గుప్తాకు ముడుపులు చెల్లించిందని అక్టోబర్‌ 2018 నుండి సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) వద్ద రుజువులు ఉన్నాయి. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ ద్వారా వివిఐపి ఛాపర్‌ల సరఫరాకు సంబంధించిన కుంభకోణానికి సంబంధించి రెండు ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్న మరో అవినీతి కేసులో బయటపడిన రహస్య పత్రాల్లో ఆధారాలు ఉన్నాయి. కాగా ఆరోపించిన చెల్లింపుల్లో ఎక్కువ భాగం 2013కి ముందు జరిగినవేనని నివేదిక వివరించింది. అయితే ఒక ఆంగ్ల వార్తా సంస్థ ఈ పత్రాల ప్రామాణికత గురించి అడుగగా సీబీఐ స్పందించలేదు. ‘రాఫెల్‌ పత్రాల’పై మీడియాపార్ట్‌ జులైలో దర్యాప్తును ప్రారంభించింది. మారిషస్‌కు చెందిన ఇంటర్‌స్టెల్లర్‌ టెక్నాలజీలో నమోదయిన షెల్‌ కంపెనీ ద్వారా అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ నుండి లంచాలు అందుకున్నట్లు సుషేన్‌ గుప్తాపై ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తును సులభతరం చేయడానికి కంపెనీకి సంబంధించిన పత్రాలను సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు పంపేందుకు మారిషస్‌ అధికారులు అంగీకరించారు. రాఫెల్‌ డీల్‌లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఏజెన్సీకి అధికారిక ఫిర్యాదు అందిన వారం తర్వాత, అక్టోబర్‌ 11, 2018న పత్రాలను సీబీఐకి పంపారు. ‘అయితే సీబీఐ దర్యాప్తు ప్రారంభించకూడదని నిర్ణయించుకుంది. ఆ అవినీతి ఫిర్యాదు దాఖలైన ఏడు రోజుల తర్వాత రహస్య కమీషన్లు నిజంగానే చెల్లించినట్లు రుజువు చేసే సమాచారం అందింది’ అని మీడియాపార్ట్‌ తెలిపింది. రాఫెల్‌ డీల్‌పై దస్సాల్ట్‌కు మధ్యవర్తిగా సుషేన్‌ గుప్తా కూడా వ్యవహరించినట్లు గుర్తించినట్లు వివరించింది. ‘గుప్తాకు చెందిన ఇంటర్‌స్టెల్లార్‌ టెక్నాలజీస్‌ 20072012 మధ్య కాలంలో ఫ్రెంచ్‌ ఏవియేషన్‌ సంస్థ నుండి కనీసం 7.5 మిలియన్‌ యూరోలను పొందింది. కాంట్రాక్టుల కారణంగా స్పష్టంగా ఎక్కువ బిల్‌ చేయబడిరది. తప్పుడు ఇన్వాయిస్‌లు సృష్టించి దీని నుండి చాలా డబ్బును తెలివిగా మారిషస్‌కు తరలించారు’ అని పేర్కొంది. ఈ ఇన్వాయిస్‌ల్లో ఫ్రెంచ్‌ కంపెనీ ‘డస్సాల్ట్‌’ పేరును తప్పుగా ఉపయోగించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు 20072012 మధ్య కాలంలో డస్సాల్ట్‌ ద్వారా ఈ బిడ్‌ను పొందినట్లు మీడియాపార్ట్‌ తెలిపింది. అక్టోబర్‌ 4, 2018న దాఖలు చేసిన ఫిర్యాదు, 2015 నుండి జరిగిన అనుమానాస్పద కార్యాచరణను లక్ష్యంగా చేసుకుంది. అయితే భారత్‌లో ప్రస్తుత బీజేపీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని ఖరారు చేసిందని మీడియాపార్ట్‌ పేర్కొంది. కాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) పొందిన ఒక పత్రంలో సుషేన్‌ గుప్తా డస్సాల్ట్‌ తరపున కొంతమంది అధికారులకు డబ్బును అందజేయాలని సూచించాడు. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లకు అందిన ఇతర పత్రాలు 2015లో ఉన్నట్లు చూపిస్తున్నాయి. రాఫెల్‌ కాంట్రాక్టుకు సంబంధించిన తుది చర్చల సమయంలో భారత సంధానకర్తల వైఖరిని వివరించే రహస్య పత్రాలను రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి సుషేన్‌ గుప్తా స్వాధీనం చేసుకున్నారని, ప్రత్యేకించి వారు ఈ యుద్ధ విమానాల ఎలా ధరను లెక్కించారనే విషయాలు ఉన్నాయని, ఈ పత్రాలపై వ్యాఖ్యానించడానికి డస్సాల్ట్‌ నిరాకరించిందని మీడియాపార్ట్‌ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img