Saturday, August 20, 2022
Saturday, August 20, 2022

రాహుల్‌ గాంధీకి ఈడీ తాజా సమన్లు

జూన్‌ 13న విచారణకు రావాలంటూ నోటీసులు
మనీ లాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది.ఈ కేసులో విచారణకు జూన్‌ 2న హాజరు కావాల్సి ఉండగా తేదీ మార్చాల్సి మార్చాలంటూ ఆయన దర్యాప్తు సంస్థను కోరారు. దీంతో జూన్‌ 13న విచారణకు రావాలంటూ ఈడీ మళ్లీ కొత్త తేదీతో సమన్లు జారీచేసింది. రాహుల్‌ గాంధీ డైరెక్టర్‌గా ఉన్న యంగ్‌ ఇండియా లిమిటెడ్‌ అనే ప్రైవేట్‌ సంస్థ ద్వారా ఏజేఎల్‌ అనే ప్రభుత్వ రంగ సంస్థను గాంధీలు పొందారని, నిధులను దుర్వినియోగం చేశారని, భూములను ఆక్రమించారని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఢల్లీి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఏజేఎల్‌ లో షేర్‌ హోల్డర్లయిన మాజీ న్యాయ శాఖ మంత్రి శాంతి భూషణ్‌, అలహాబాద్‌, మద్రాస్‌ హైకోర్టుల మాజీ చీఫ్‌ జస్టిస్‌ మార్కండేయ కట్జూలకు తెలియకుండానే షేర్లను కంపెనీ పేరిట ట్రాన్స్‌ ఫర్‌ చేశారంటూ పిటిషన్‌ లో పేర్కొన్నారు. రూ.2 వేల కోట్ల ఆస్తులను చేజిక్కించుకునేందుకు ఏజేఎల్‌తో పాటు నేషనల్‌ హెరాల్డ్‌ షేర్లను కూడా తప్పుడు మార్గంలో గాంధీలు బదలాయించుకున్నారని ఆ పిల్‌లో సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img