Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వాయిదాలతోనే సరి…

7వ రోజు అదే తంతు
విపక్షాల ఆందోళనతో చట్టసభలు రసాభాస
గందరగోళం నడుమ బిల్లుల ప్రవేశం
స్పీకర్‌పై పేపర్లు విసిరిన కాంగ్రెస్‌ సభ్యులు : 10 మంది సస్పెన్షన్‌

న్యూదిల్లీ :
పెగాసస్‌తో పాటు కొత్త సాగు చట్టాలపై పార్లమె ంటులో రభస కొనసాగుతోంది. ఓ వైపు ప్రతిపక్షాల నినాదాలు మరోవైపు తమకు నచ్చిన రీతిలో సభ జరపాలన్న అధికారపక్ష పట్టుతో ఉభయ సభలు ఏడవరోజు రసాభాస అయ్యాయి. వరుస వాయిదా లతో చివరకు గురువారానికి

వాయిదా పడ్డాయి. పెగాసస్‌పై చర్చించాలని విపక్షాలు డిమాండు చేస్తున్నప్పటికీ కేంద్రం అంగీకరించకపోవ డంతో పార్లమెంటులో గందరగోళం నెలకొంటోంది. దిగువసభ ఐదుసార్లు వాయిదా పడిరది. గందరగోళం నడుమ కొన్ని బిల్లులను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. సభ వాటిని ఆమోదించే ప్రయత్నం చేసింది. లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగారు. స్పీకర్‌ పోడియం వద్దకు దూసుకెళ్లిన ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. వారి ఆందోళనల నడుమే సభాపతి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. దీంతో విపక్ష సభ్యులు నిరసనను మరింత ఉధృతం చేశారు. కాంగ్రెస్‌ సభ్యులు స్పీకర్‌ చైర్‌, ట్రెజరీ బెంచ్‌లపైకి కాగితాలు విసిరారు. దీంతో ఆగ్రహానికి గురైన స్పీకర్‌ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12.30 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ సభ్యులు మరలా ఆందోళనకు దిగడంతో సభ నియంత్రణలో లేకపోవడంతో మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడిరది. అటు రాజ్యసభలోనూ అదే గందరగోళం కనిపించింది. విపక్షాల నిరసనలతో సభ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే వాయిదా పడిరది. ఆ తర్వాత మళ్లీ 12 గంటలకు సభ మొదలు కాగా విపక్ష ఎంపీలు సీట్లలో నుంచి లేచి ఆందోళన చేపట్టారు. పెగాసస్‌పై చర్చ జరపాలంటూ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. భోజన విరామంలో సభ తిరిగి సమావేశమైనప్పుడు బీజేపీ సభ్యుడు భువనేశ్వర్‌ కలితా సభాపతిగా వ్యవహరించారు. జువనైల్‌ జస్టిస్‌ (సంరక్షణ, పిల్లల రక్షణ) సవరణ బిల్లు, 2021ను సభ పరిశీలన కోసం ప్రవేశపెట్టాలని మహిళా శిశు సంక్షేమ మంత్రి స్మృతి ఇరానీకి సూచించారు. బిల్లుపై మంత్రి వివరణ ఇచ్చే సమయంలోనూ ప్రతిపక్షాల నినాదాలు కొనసాగాయి. ఆమె 2.15 గంటల వరకు మాట్లాడారు. పిల్లలకు సంబంధించిన ఈ బిల్లును ఆమోదించేందుకు సభను కొనసాగనివ్వాలని సభాపతి కోరినాగానీ విపక్ష ఎంపీలు తమ ఆందోళనను కొనసాగించగా 30 నిమిషాల పాటు 2.45గంటల వరకు సభ వాయిదా పడిరది. అంతకుముందు చైర్మన్‌ వెంకయ్య నాయుడు జిరో అవర్‌ నిర్వహించారు. కాంగ్రెస్‌, టీఎంసీ సహా ప్రతిపక్షాల ఎంపీలు పెగాసస్‌, సాగు చట్టాలు, ఇంధన ధరల పెంపు తదితర అంశలపై నినాదాలు చేశారు. ప్లకార్డులతో వెల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సభలో ప్లకార్డుల ప్రదర్శనకు అనుమతి లేదని వెంకయ్య ఆదేశించారు. జీరో అవర్‌లో ప్రస్తావించే అంశం, ఎంపీ పేరును ముద్రించాలని రాజ్యసభ సెక్రటేరియట్‌కు సూచించారు. తద్వారా సభలో ఎవరు ఏ అంశంపై మాట్లాడారో ప్రజలకు తెలుస్తుందని వెంకయ్య చెప్పారు. ఆపై సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం సభ కార్యకలాపాలను డిప్యూటీ చైర్మన్‌ నారాయణ సింగ్‌ నిర్వహించారు. విపక్షాల నినాదాల మధ్య ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. వెల్‌లోకి దూసుకెళ్లిన ప్రతిపక్ష ఎంపీలు ప్రాంతీయ భాషల్లో నినాదాలు చేశారు.
గందరగోళం నడుమ ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు. ఇదిలావుంటే, లోక్‌సభలో ఆందోళన క్రమంలో కాంగ్రెస్‌ సభ్యులు కొందరు చైర్‌పై ట్రజరీ బెంచీలపై కాగితాలు విసరడాన్ని స్పీకర్‌ ఓం బిర్లా తీవ్రంగా పరిగణించారు. చైర్‌ను అవమానించారని, 374(2) నిబంధన ప్రకారం పది మంది ఎంపీలను సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటివి పునరావృతమైతే లోక్‌సభ బహిష్కరణ తప్పబోదని స్పీకర్‌ హెచ్చరించారు. సెస్పండ్‌ అయిన వారిలో మాణిక్యం ఠాగూర్‌, డీన్‌ కురియకోజ్‌, హిబ్బి హిడన్‌, జోయిమని, రవనీత్‌ బిట్టు, గుర్జీత్‌ ఔజ్లా, ప్రతాపన్‌, వైథిలింగం, సప్తగిరి శంకర్‌, ఏఎం ఆరిఫ్‌, దీపక్‌ బైజ్‌ ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img