Free Porn manotobet takbet betcart betboro megapari mahbet betforward 1xbet Cialis Cialis Fiyat
Monday, June 17, 2024
Monday, June 17, 2024

వేర్పాటువాద నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ అరెస్టు

. 100 కార్లతో సినీ ఫక్కీలో ఛేజింగ్‌
. పక్కా వ్యూహంతో అదుపులోకి తీసుకున్న పంజాబ్‌ పోలీసులు

చండీగఢ్‌ : ఖలిస్థాన్‌ సానుభూతిపరుడు, వారిస్‌ పంజాబ్‌ దే నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ను పంజాబ్‌ పోలీసులు శనివారం జలంధర్‌లో అరెస్ట్‌ చేశారు. 100 కార్లతో ఛేజ్‌ చేసి మరీ అతనిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిరచాయి. అతని అనుచరులు ఆరుగురిని మోగా జిల్లాలో అదుపులోకి తీసుకున్న తర్వాత ఇది జరిగింది. దీంతో రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేసినట్లు హోం వ్యవహారాల శాఖ సీనియర్‌ అధికారి తెలిపారు. మెహత్‌పూర్‌ గ్రామంలో అతని అశ్విక దళాన్ని పోలీసులు అడ్డుకున్న తర్వాత అమృత్‌పాల్‌ సింగ్‌ను జలంధర్‌లోని నకోదర్‌ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల చర్యపై అధికారిక ధ్రువీకరణ లేదు. వారిస్‌ పంజాబ్‌దేను స్థాపించిన నటుడు దీప్‌ సిద్ధూ మరణించిన వెంటనే వేర్పాటువాద నాయకుడిగా అమృత్‌పాల్‌ ఆ సంస్థను స్వాధీనం చేసుకున్నాడు. జి20 సదస్సు దృష్ట్యా ఇన్ని రోజులూ అతనిపై చర్యలు తీసుకోలేదు. జి20 సదస్సు ముగిసిన మరుసటి రోజే అమృత్‌పాల్‌ అరెస్టుకు పంజాబ్‌ పోలీసులు శనివారం వ్యూహాన్ని అమలు చేశారు. జలంధర్‌లోని షాకోట్‌కు అతను వస్తున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో పక్కా ప్రణాళిక ప్రకారం అమృత్‌పాల్‌, అతని అనుచరులను చుట్టుముట్టారు. పోలీసులు అరెస్టు చేసేందుకు వస్తున్నారని తెలియగానే అతను పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసుల ప్రత్యేక బృందం 100 కార్లలో అతనిని వెంబడిరచింది. జిల్లా సరిహద్దులను మూసేసింది. కొన్ని గంటల పాటు వెంబడిరచి చివరకు జలంధర్‌లోని నాకోదార్‌ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడిరచాయి. అంతకుముందు అతని ఆరుగురు అనుచరులను కూడా అరెస్టు చేశారు. పోలీసులు తమను వెంబడిస్తున్నారని పేర్కొంటూ ‘వారిస్‌ పంజాబ్‌ దే’ నాయకుడి మద్దతుదారులు కొందరు సామాజిక మాధ్యమాల్లో కొన్ని వీడియోలను పంచుకున్నారు. అమృత్‌పాల్‌ వాహనంలో కూర్చున్నట్లు కూడా ఒక వీడియో చూపించింది. అతని సహాయకులలో ఒకరు పోలీసులు ‘భాయ్‌ సాబ్‌’ (అమృత్‌పాల్‌) తర్వాత ఉన్నారని చెప్పడం వినిపించింది. ఇదిలా ఉండగా, శాంతి, సామరస్యాలను కాపాడాలని పంజాబ్‌ పోలీసులు ప్రజలను కోరారు. ‘పంజాబ్‌ పోలీసులు శాంతిభద్రతలను కాపాడేందుకు కృషి చేస్తున్నారు. భయాందోళనలకు గురికావద్దు. నకిలీ వార్తలు లేదా ద్వేషపూరిత ప్రసంగాలను వ్యాప్తి చేయవద్దని పౌరులను అభ్యర్థించండి’ అని ట్వీట్‌లో పేర్కొంది. ఈ అరెస్టుతో ఎలాంటి అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. భారీగా పోలీసులు మోహరించారు. అమృత్‌సర్‌ సమీపంలోని జుల్లుపూర్‌ ఖేరా గ్రామంలో అమృత్‌పాల్‌ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పంజాబ్‌ వ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం వరకు ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేశారు. ఖలిస్థాన్‌ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌కు అత్యంత సన్నిహితుడైన లవ్‌ప్రీత్‌ సింగ్‌ అలియాస్‌ తూఫాన్‌ సింగ్‌ను ఇటీవల పంజాబ్‌ పోలీసులు ఒక కిడ్నాప్‌ కేసులో అరెస్టు చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ అమృత్‌పాల్‌ పిలుపు మేరకు ఫిబ్రవరి 24న పెద్ద సంఖ్యలో యువత అమృత్‌సర్‌ జిల్లాలోని అజ్‌నాలా పోలీస్‌ స్టేషన్‌పై దాడికి తెగబడ్డారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో ఎస్పీ హోదా కలిగిన అధికారి సహా ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. నిరసనకారులు బీభత్సం సృష్టించడంతో పోలీసులు మరో దారిలేక లవ్‌ప్రీత్‌ను విడిచిపెట్టాల్సి వచ్చింది. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర యంత్రాంగం అల్లర్లు జరిగేలా యువతను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై అమృత్‌పాల్‌ పై కేసు నమోదు చేసింది. ఇదిలాఉండగా, కాంగ్రెస్‌ ఎంపీ రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టు… అమృత్‌పాల్‌ సింగ్‌పై విరుచుకుపడ్డారు. ‘ఖలిస్తాన్‌ కోసం ఆయుధాలు పట్టుకోవడం గురించి మాట్లాడే వ్యక్తి నేడు పోలీసులకు భయపడి పారిపోతున్నాడు’ అని అన్నారు. ‘సిక్కులు ఎప్పుడైనా పారిపోయారా? ధైర్యం ఉంటే పోలీసులను ఎదుర్కొనేవాడు. నక్కలాగా వీధుల్లో తిరుగుతున్నాడు. మా పిల్లలను చంపడానికి వచ్చాడని నేను కూడా ఇంతకు ముందు చెప్పాను. అతను (ఇంటెలిజెన్స్‌) ఏజెన్సీల వ్యక్తి’ అని బిట్టు ట్విట్టర్‌లో వీడియో ద్వారా తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img