Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

సంతలో పశువుల్లాగా ఎమ్మెల్యేల కొనుగోలా?

. బీజేపీ వైఖరి సిగ్గుచేటు
. పవన్‌ కల్యాణ్‌ ఎన్డీఏ నుంచి బయటకు రావాలి
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి:
తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసేందుకు బీజేపీ వందల కోట్ల రూపాయలు ఆఫర్‌ చేయటం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో అన్నారు. రాజకీయాల్లో నైతిక విలువలపై మాట్లాడే పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికైనా ఎన్డీఏ నుంచి బయటకు రావాలన్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా కొనేందుకు బీజేపీ వందల కోట్ల రూపాయల ఆఫర్‌ చేసి పోలీసులకు దొరికిపోయిందన్నారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక మొత్తం రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్‌పై జరుగుతోందని, గతంలో వివిధ రాష్ట్రాల్లో మెజార్టీ లేకపోయినా ప్రత్యర్థి పార్టీల ప్రజా ప్రతినిధులను బెదిరించడం, బ్లాక్‌ మెయిల్‌ చేయటం, డబ్బుతో కొనుగోలు చేయటం వంటి అనైతిక పనులు చేసిన బీజేపీ అధికార పీఠాలు అడ్డదారుల్లో దక్కించుకున్నదని గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణలో చిచ్చుపెట్టేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని, బీజేపీ వద్ద లక్షల కోట్ల రూపాయల అక్రమ ధనం ఉన్నందున, విచ్చలవిడిగా ఎమ్మెల్యేల కొనుగోలుకు ఖర్చుచేస్తోందని విమర్శించారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు వందల కోట్లు వెచ్చిస్తోందన్నారు. బీజేపీకి చెందిన కేంద్రంలోని పెద్దాయన కనుసన్నల్లోనే ఈ అక్రమ వ్యవహారం జరుగుతున్నట్లు తెలుస్తోదన్నారు. బీజేపీ మతవాద, కుయుక్త, బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలను ప్రజాతంత్ర వాదులంతా ఖండిరచాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. బీజేపీ అనైతిక వ్యవహార శైౖలిపై హైదరాబాదులోనే ఉన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించాలని, రాజకీయాల్లో నైతిక విలువలపై మాట్లాడే ఆయన ఇప్పటికైనా ఎన్డీఏ నుంచి బయటకు రావాలని రామకృష్ణ సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img