Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సగం మంది అవుట్‌

ఎలన్‌ మస్క్‌ దూకుడు` ట్విట్టర్‌ ఉద్యోగులపై వేటు

. వెలవెలబోయిన లండన్‌, డెర్బిన్‌ కార్యాలయాలు
. సామూహిక తొలగింపులకు పౌర హక్కుల సంఘాల ఖండన
. ప్రకటనల ఉపసంహరణకు ప్రముఖ సంస్థలపై కార్యకర్తల ఒత్తిడి
. యాడ్‌ల ఆదాయం తగ్గిందన్న మస్క్‌

న్యూదిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పనిచేసే వారు ఇంటి బాట పట్టాల్సి వచ్చింది. ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఉద్యోగాలను తొలగించడంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. కొందరు కోర్టును ఆశ్రయించారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పుడు సిబ్బందిని తొలగించనని ఎలన్‌ మస్క్‌ అన్నారు. కానీ కొనుగోలు ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మాట తప్పారు. సగానికి సగం మందిపై వేటు వేశారు. తొలుత ఉద్యోగులపై పని ఒత్తిడి పెంచితే వాళ్లే రాజీనామా చేసేస్తారని ఆయన భావించారుగానీ అలా జరగకపోవడంతో ఒకేసారి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. దీంతో పౌరహక్కుల సంఘాలు, కార్యకర్తలు ట్విట్టర్‌ చర్యను తప్పుపట్టారు. అంతర్జాతీయ స్థాయిలో ట్విట్టర్‌కు ప్రకటనలు ఇవ్వవద్దని, ఇచ్చినవీ ఉపసంహరించుకోవాలని ప్రముఖ బ్రాండ్లపై కార్యకర్తలు ఒత్తిడి పెంచిన ఫలితంగా జనరల్‌ మోటార్స్‌ కో, జనరల్‌ మిల్స్‌ ఇంక్‌ వంటి బ్రాండ్లు ట్విట్టర్‌ ప్రకటనలను నిలిపివేశాయి.
శుక్రవారం సగం మందిని ట్విటర్‌ ఇంక్‌. తొలగించింది. తప్పుడు సమాచారం వ్యాప్తిని నిరోధించే బాధ్యత ఉన్న బృందంలో కోతలు ఉన్నట్లు పేర్కొంది. కంటెంట్‌ నియంత్రణ గురించి ఆందోళనల మధ్య ప్రకటనదారులు డబ్బు వెచ్చించేందుకు సిద్ధంగా లేరని తెలిపింది. అయితే సిబ్బంది చేసిన ట్వీట్ల ప్రకారం కమ్యూనికేషన్స్‌, కంటెంట్‌ క్యూరేషన్‌, హ్యూమన్‌ రైట్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ ఎథిక్స్‌కు బాధ్యత వహించే బృందాలలో ఉత్పత్తి ఇంజినీరింగ్‌ టీమ్‌లు ఉన్నాయని తెలుస్తోంది. ట్విట్టర్‌కు పెద్ద ప్రకటనకర్తలుగా ఉన్న వారిపై కొన్ని పౌర సంఘాల సంకీర్ణం తెచ్చిన ఒత్తిడి కారణంగా తమ సంస్థకు ప్రకటనల ఆదాయం పడిపోయిందని మస్క్‌ పేర్కొన్నారు. రోజుకు 4 మిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువగానే నష్టపోతున్నట్లు తెలిపారు. ఇలాంటప్పుడు ఉద్యోగులను తొలగించడం తప్ప ప్రత్నామ్నాయం లేదని ఓ ట్వీట్‌ చేశారు. తొలగించిన వారికి మూడు నెలల జీతం ఇచ్చినట్లు మస్క్‌ వెల్లడిరచారు. 3,700 మంది అంటే సగానికిపైగా ఉద్యోగాల తొలగింపుపై ర్యూటర్స్‌ ఇటీవల పేర్కొంది. తొలగిత సిబ్బందిలో శాన్‌ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయానికి చెందిన 784 మంది ఉంటే శాన్‌ జోస్‌, లాస్‌ ఏంజిల్స్‌ నుంచి 199 మంది ఉన్నట్లు కాలిఫోర్నియా ఎంప్లాయిమెంట్‌ అథారిటీ డేటా చెబుతోంది. సీఈఓ, సీఎఫ్‌ఓలను తొలగించడంతో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఒకరి తర్వాత ఒకరు రాజీనామా చేశారు. దీంతో శుక్రవారం లండన్‌, డబ్లింగ్‌ కార్యాలయాలు వెలవెలబోయాయి. కంపెనీలోని మొత్తం మానవ హక్కుల బృందాన్ని తొలగించినట్లు ట్విట్టర్‌లో మానవ హక్కుల తాత్కాలిక హెడ్‌ అటార్నీ షానన్‌ రాజ్‌సింగ్‌ ట్వీట్‌ చేశారు. మాజీ సీనియర్‌ మేనేజర్‌ చేసిన ట్వీట్‌ ప్రకారం, మస్క్‌కి ఉన్న సమస్య... మెషీన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్‌లను ట్విట్టర్‌ ఎలా ఉపయోగించిందనేదని, దానిపై పరిశోధనపై దృష్టి సారించిన మరో బృందంపైనా వేటు పడిరదన్నారు. ఇంజినీరింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆర్నాడ్‌ వెబర్‌తో సహా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు శుక్రవారం ట్విట్టర్‌లో వీడ్కోలు చెప్పారు. ప్రతి ఉద్యోగి భద్రతతో పాటు ట్విట్టర్‌ వ్యవస్థలు `కస్టమర్‌ డేటాను నిర్ధారించడంలో సహాయపడటానికి కార్యాలయాలు తాత్కాలికంగా మూసివేయబడతాయి. బ్యాడ్జ్‌ యాక్సెస్‌ నిలిపివేస్తున్నాం’ అంటూ సిబ్బందికి ఈమెయిల్స్‌ అందాయి. ఇదిలావుంటే, కొందరు ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 60 రోజుల ముందస్తు నోటీసు లేకుండా విధుల్లో నుంచి తొలగించినట్లు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img