Thursday, December 8, 2022
Thursday, December 8, 2022

స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గిన కేసులు.. మళ్లీ రెండు వేలు దాటాయి. గత 24 గంటల్లో 1,42,704 నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2,208 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,49,088కి చేరింది. నిన్న ఒక్కరోజే 3,619 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 19,398 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా 12 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,28,999కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. ఇక మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.77 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.60 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img