Friday, December 2, 2022
Friday, December 2, 2022

సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల


సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. జూలై 30న 12వ తరగతి ఫలితాలు విడుదల చేసిన బోర్డు ఇవాళ 10వ తరగతి ఫలితాలను కూడా వెల్లడిరచింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సీబీఎస్‌ఈ బోర్డు ఈ ఫలితాలను విడుదల చేసింది. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది కూడా సీబీఎస్‌ఈ 10,12 తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. గతవారం 12వ తరగతి ఫలితాలు విడుదల చేయగా, రికార్డు స్థాయిలో 99.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.వాస్తవానికి పదో తరగతి ఫలితాలు జులై 20న విడుదల చేయాల్సి ఉండగా, పాఠశాలల నుంచి మార్కుల జాబితా పంపడంలో ఆలస్యం కావడంతో ఫలితాల విడుదల కూడా వాయిదా పడిరది. తాజాగా ఈ ఫలితాలను బోర్డు విడుదల చేసింది. విద్యార్థులు ఫలితాలు అధికారి వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నట్లు సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img