Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పెరిగిన ఇంధన ధరలపై.. రాహుల్‌ వినూత్న నిరసన..

పార్లమెంట్‌కు సైకిల్‌ యాత్ర
రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌, ఇతర నిత్యవసరాల ధరలపై కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వినూత్న శైలిలో నిరసన తెలిపారు.మంగళవారం సైకిల్‌పై పార్లమెంటు సమావేశాలకు వచ్చారు. ఆయన వెంట విపక్ష పార్టీల నేతలు కూడా సైకిళ్లపై అనుసరించారు. దీనికి ముందు, రాహుల్‌ పార్లమెంటు విపక్ష పార్టీల లోక్‌సభ, రాజ్యసభ ఫ్లోర్‌ లీడర్లతో కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో బ్రేక్‌ ఫాస్ట్‌ మీట్‌ ఏర్పాటు చేశారు. బీజేపీ,ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు కలిసి పోరాడాల్సిన అవసరముందని రాహుల్‌ పిలుపునిచ్చారు. పగాసస్‌ వ్యవహారం, పెట్రో ధరలు, సాగు చట్టాల రద్దు అంశంలో కేంద్ర వైఖరిని ప్రతిపక్ష పార్టీలు తప్పుపట్టాయి. కాంగ్రెస్‌తో పాటు, ఎన్‌సీపీ, శివసేన, ఆర్జేడీ, ఎస్‌పీ, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్‌, రివల్యూషనరీ పార్టీ (ఆర్‌ఎస్‌పీ), కేరళ కాంగ్రెస్‌, జార్ఖండ్‌ ముక్తి మోర్చా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, టీఎంసీ, లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ (ఎల్‌జేడీ) నేతలు ఈ బ్రేక్‌ఫాస్ట్‌ మీట్‌లో పాల్గొన్నారు. అనంతరం రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌కు సైకిల్‌ యాత్ర చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img