Wednesday, May 22, 2024
Wednesday, May 22, 2024

హీరో సాయిధరమ్‌ తేజ్‌కు తీవ్ర గాయాలు

హైదరాబాద్‌ : హీరో సాయిధరమ్ తేజ్‌.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో సాయిధరమ్‌ తేజ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్‌ అపస్మారక స్థితిలో వెళ్లినట్లు తెలుస్తోంది. నగరంలోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. హెల్మెట్‌ ఉన్నా, ప్రమాద తీవ్రత కారణంగా గాయాలు బలంగా తగిలాయి. వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు 108 సాయంతో దగ్గర్లోని మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు. సాయిధరమ్‌ తేజ్‌ కుడికన్ను, ఛాతి, పొట్ట భాగంలో తీవ్రగాయాలు అయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. మెడికవర్‌ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం.. మెరుగైన చికిత్స నిమిత్తం ఆయన్ను అపోలో ఆసుపత్రికి తరలించారు. మెగా అభిమానులు తీవ్ర విషాదంలో ఉన్నారు. వైద్యులు మాట్లాడుతూ.. చికిత్స అందిస్తున్నామని, సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నాడని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img