Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

హెచ్3ఎన్2 కేసులు, వైరల్ ఫీవర్లు: చిన్నారుల తల్లిదండ్రులకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక సూచనలు!

దేశంలో హెచ్3ఎన్2 వైరస్ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు సీజన్ మారుతుండటంతో వైరల్ ఫీవర్లు కూడా పెరుగుతున్నాయి. ఈ రెండింటికి దాదాపు ఒకే రకమైన లక్షణాలు ఉంటున్నాయి. కాగా రాష్ట్రంలో వైరల్ ఫీవర్లు మాత్రమే ఉన్నాయమని.. హెచ్3ఎన్్ణ కేసులు లేవని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇన్‌ఫ్లుయెంజా సబ్ వేరియంట్ అయిన ఈ వైరస్ గురించి ఆందోళన చెందొద్దని.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని ఆరోగ్య శాఖ సూచించింది. జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు ఉన్న విద్యార్థులు 2-3 రోజులపాటు పాఠశాలలకు వెళ్లకపోవడం మంచిదని తెలిపింది. తద్వారా వైరస్ వేరే వారికి వ్యాప్తి చెందే అవకాశం తగ్గుతుందని పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటికైతే వైరల్‌ జ్వరాలే ఎక్కువగా ఉన్నాయని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. గురువారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మట్లాడిన సందర్భంగా మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఈ వివరాలను వెల్లడించారు. జనవరి, ఫిబ్రవరి నెలలతో పోలిస్తే రాష్ట్రంలో వైరల్ ఫీవర్లు తగ్గాయన్నారు. వాతావరణం చల్లగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే వైరల్ ఫీవర్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇప్పుడు వస్తున్న జ్వరాల లక్షణాలు కోవిడ్ లక్షణాలకు దగ్గర ఉంటుండటంతో జనం ఆందోళనలో ఉన్నారని పల్మనాజిస్టు రఘు చెప్పారు. కానీ వైరల్ ఫీవర్లు మూడు నాలుగు రోజుల్లో తగ్గిపోతాయన్నారు. కోవిడ్ బారిన పడిన వారిలో, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిలో మాత్రం జ్వరం, దగ్గు ఎక్కువ రోజులపాటు ఉండే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు, హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తులు, ఆస్తమాతో బాధపడుతున్న వారు, పొగాకు, మద్యం అలవాటు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. జ్వరంతోపాటు జలుబు, దగ్గు, తలనొప్పి, ముక్కు కారడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సూచించినట్లుగా అనవసరంగా యాంటీ బయోటిక్స్ ఇవ్వొద్దని డాక్టర్లు తెలిపారు. లక్షణాలను బట్టి మందులు వాడితే కొద్ది రోజుల్లోనే శరీరం నుంచి వైరస్ మాయం అవుతుందన్నారు. దగ్గు వచ్చినప్పుడు కఫం రంగు పసుపు పచ్చగా లేదా ఆకుపచ్చగా మారితే లేదంటే కఫంలో రక్తం కనిపించినా.. నిమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. జ్వరం బారిన పడిన పిల్లలు ఆడుకోకుండా, అన్నం తినకుండా.. మగతగా ఉంటుంటే.. డాక్టర్లను సంప్రదించాలని తెలిపింది. గర్భిణులు కూడా ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే అప్రమత్తమై డాక్టర్ వద్దకు వెళ్లాలని సూచించింది.

హెచ్3ఎన్2 వైరస్ విషయానికి వస్తే.. కోవిడ్ తరహాలోనే ఇది కూడా తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి మాత్రం ఇది ఇబ్బందికరంగా మారుతుంది. సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం ద్వారా ఈ వైరస్ బారిన పడకుండా ఉండొచ్చు. హై రిస్క్ గ్రూప్‌లో ఉన్నవారికి, వృద్ధులకు ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్లు ఉన్నాయని ఎయిమ్స్ టాప్ డాక్టర్‌గా పని చేసిన డాక్టర్ గులేరియా తెలిపారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించడంతోపాటు.. ఇమ్యూనిటీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని గులేరియా సూచించారు. తగినంత నీరు, ద్రవాలు తీసుకోవాలని, చల్లటి నీరు, ఐస్ క్రీమ్‌లు, కూల్ డ్రింక్స్, ఆయిల్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని డాక్టర్ గులేరియా సూచించారు. పిల్లలు ఈ వైరస్ బారిన పడితే.. దగ్గు సిరప్‌లు, నెబ్యులైజేషన్‌తోపాటు పరిశుభ్రత పాటించాలని ఢిల్లీకి చెందిన డాక్టర్ గౌరవ్ శర్మ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img